»   » పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ ముగిసిందంటూ...!

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ ముగిసిందంటూ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య నటుడికి, దర్శకుడికి మద్య ఉండే సంబంధానికి మించిన రిలేషన్ షిప్ ఉంది. పవన్ కళ్యాణ్‌‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇద్దరూ కలిసి ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' లాంటి సూపర్ హిట్ చిత్రాలను అభిమానులకు అందించారు. ఇద్దరూ కలిసి తెలుగు సినిమా రికార్డులను తిరగరాసారు.

ఈ సినిమాలు మాత్రమే కాదు....పవన్ కళ్యాణ్ సినిమాల సెలక్షన్లో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించేవారట. ఇతర దర్శకులతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు త్రివిక్రమ్ డైలాగులు కూడా రాసారు. ఇద్దరి మధ్య సినిమా బంధానికి మించిన పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉండటం వల్లనే జరిగిందని అంటుంటారు.

Rumours on Pawan Kalyan, Trivikram Friendship

అయితే తాజాగా వీరి ఫ్రెండ్షిప్ గురించి ఫిల్మ్ నగర్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ ‘సర్దార్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును రీ ఎగ్జామినింగ్ చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరినప్పటికీ త్రివిక్రమ్ అందుకు నిరాకరించారట. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ దెబ్బతినడం వల్లనే ఇలా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కాదనడంతో కోన వెంకట్, సాయి మాధవ్ బుర్రాలను రంగంలోకి దింపారట పవన్.

అయితే అలాంటిదేమీ లేదని, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇతర పనులతో బిజీగా ఉండటం వల్లనే ‘సర్దార్' స్క్రిప్టు రీ ఎగ్జామినింగ్ చేయలేక పోయారని పవన్ కళ్యాణ్ సన్నిహితులు అంటున్నారు. గబ్బర్ సింగ్-2 సినిమానే ‘సర్దార్' సినిమాగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా ఏళ్ల నుండి పెండింగులో ఉంది. పలువురు దర్శకులు మారారు. చివరకు కెఎస్ రవీంద్ర(బాబీ) ఓకే అయ్యారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. సెకండ్ షెడ్యూల్ ఈనెల 29 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రెండో షెడ్యూల్ నుండి పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొనబోతున్నారు.

English summary
Reports say Trivikram did not turn up at Pawan Kalyan’s request on re-examining the ‘Sardar’ script and dialogues. ‘Sardar’ initially titled ‘Gabbar Singh 2’ has passed through multiple hands finally landing in KS Ravindra aka Bobby pocket. When Trivikram failed to rescue, Pawan roped in script specialist Kona Venkat and dialogue writer Sai Madhav Burra for a follow through.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu