మరో అగ్ర దర్శకుడితో రామ్ పోతినేని మాస్ మూవీ

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాలా కొత్తగా కనిపించిన రామ్ పోతినేని మొదటిసారి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అనంతరం మళ్ళీ అదే రేంజ్ లో హిట్టు కొట్టాలని అనుకున్న రామ్ 'రెడ్' సినిమాతో పరవాలేదు అనిపించాడు. ఇక తదుపరి సినిమాను తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో చేస్తున్న విషయం తెలిసిందే.

బైలాంగ్యువల్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఆ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. అయితే ఆ సినిమా అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని రామ్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇక దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ రీసెంట్ గా ఒక ఊర మాస్ స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాలయ్య సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.

Rumours on Ram pothineni and boyapati srinivas combination

ఆ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ సినిమా అయిపోగానే బోయపాటి కూడా మరో సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ వేశాడు. కొందరి హీరోలకు కథలను చెప్పినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. ఇక మరో రెండు కథలపై కూడా రామ్ త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X