Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తల్లి కాబోతున్న స్టార్ హీరో భార్య.. అందుకే అన్ని జాగ్రత్తలు?
కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక స్టార్ హీరో భార్య తల్లి కాబోతోంది అనే రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ స్పెషల్ కపుల్స్ మరెవరో కాదు. ఆర్య - సయేషా సైగల్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్స్ సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే సయేశా త్వరలోనే తల్లి కాబోతోంది అనే కామెంట్స్ వస్తున్నాయి.
Recommended Video
బెస్ట్ లవ్ బర్డ్స్..
ఆర్య - సయేషా సైగల్ జంటకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. వీరు కలిసి ఒక ఫొటోకు స్టిల్ ఇస్తే చాలు సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ కావాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి తరువాత కూడా బెస్ట్ లవ్ బర్డ్స్ మాదిరిగానే దర్శనమిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం వీరికి సంబంధించిన ఒక స్పెషల్ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది.
తల్లి కాబోతోందా?
ప్రస్తుతం సయేషాను చూస్తుంటే ఆమె ప్రేగ్నెంట్ తో ఉన్నట్లు టాక్ వస్తోంది. మొన్నటి వరకు ఫిట్నెస్ డ్రెస్సుల్లో కనిపించిన సయేషా ప్రస్తుతం డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసింది. ఒక వీడియోలో సల్వార్ వేసుకున్న ఆమె కాస్త బరువు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో సయేషా ప్రేగ్నెంట్ అని కోలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
ప్రేమతో గెలిచారు..
గజినీకాంత్ సినిమాతో ఒకటైన ఈ స్టార్ కపుల్స్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఆర్య వయసు 38 కాగా.. సయేషా వయసు 22. వీరి పెళ్లికి కుటుంబ పెద్దల నుంచి మొదట్లో కొంత అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ ఆ తరువాత వారి ప్రేమతో ఇంట్లో వాళ్ళ మనసును గెలుచుకుని పెళ్లితో ఒకటయ్యారు. ఇక ఇప్పుడు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్ వస్తోంది.
హెల్త్ పై స్పెషల్ కేర్..
సయేషా సైగల్ ప్రస్తుతం తన ఆరోగ్య గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి సయేషా ఫిట్నెస్ విషయంలో చాలా చురుగ్గా ఉంటుందని ఆమె సోషల్ మీడియా ఎకౌంట్స్ ని ఫాలో అయితే తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రేగ్నెంట్ అంటే అమ్మడు ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.