twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీ?

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది రూమరా, నిజమా అనేది ఎక్కడా తెలియడం లేదు. కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ఈ వార్త విస్తృత ప్రచారం అవుతోంది. ఈ విషయమై ఇండియన్ ఎక్సప్రెస్ గ్రూప్‌నకు చెందిన ఎపి వీక్లీ కూడా ఓ కథనం ప్రచురించింది. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ చెట్టపట్టాల్‌? అనే శీర్షికతో ఈ వార్త ప్రచురించింది. అలాగే పలు వెబ్ పత్రికలు సైతం ఈ వార్తకు ప్రాధాన్యత ఇచ్చాయి.

    ఎపి వీక్లీలో ఉన్న కథనం ఏమిటంటే... హీరో పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని కలుసుకోవడంపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇటీవల నాగబాబుతో కలిసి పవన్‌ కల్యాణ్‌ బాబు ఇంటికి వెళ్ళి దాదాపు అరగంట సేపు చర్చలు జరిపిన విషయం మొదట ఫిల్మ్‌ నగర్‌లో గుప్పుమంది. తర్వాత రాజకీయ వర్గాలకు వ్యాపించింది.

    64 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసివచ్చిన సందర్భంగా ఆయనను అభినందించడానికి పవన్‌ వెళ్ళినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నా, పవన్‌ తెలుగుదేశం పార్టీపై అభిమానం చూపుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి రంగం సిద్ధమవుతోందని ఎన్టీఆర్‌ ట్రస్టు వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేసినప్పుడు పవన్‌ ''కాంగ్రెస్‌ నాయకుల పంచెలూడదీసి కొడతాం'' అని హెచ్చరించాడు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, సోనియా గాంధీని అదేపనిగా పొగడడం పవన్‌కు నచ్చలేదు. నాగబాబు కూడా ఈ విషయంలో పవన్‌తో ఏకీభవిస్తున్నట్టు తెలుస్తోంది.

    పవన్‌ తెలుగుదేశంలో చేరినా, పరోక్షంగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చినా అది పెను సంచలనం అవుతుంది. ఆ పరిణామం, నందమూరి - నారా కుటుంబాల మధ్య సంఘర్షణకు దారితీయవచ్చు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటికే టిడిపికి, చంద్రబాబుకు అందకుండా దోబూచులాడుతున్నాడు. బాబుతో హరికృష్ణ సంబంధాలు కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి. పార్టీలో లోకేష్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై బాలకృష్ణ ఆనందంగా ఉన్నా హరికృష్ణకు, జూనియర్‌కు రుచించడంలేదు. ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కిన తర్వాతగానీ కొత్త ఈక్వేషన్లు స్పష్టం కావు.

    English summary
    The news of Power Star Pawan Kalyan joining Telugu Desam Party seems to have become a hot topic for both media and the general public. TDP cadres and supporters are propagating the news that if Pawan Kalyan joins TDP, then it would not only boost the morale of the party cadres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X