ఇది నిజమైతే మెగా అభిమానులకు పండగే.. శంకర్ దర్శకత్వంలో బిగెస్ట్ మల్టీస్టారర్?

ఇండియన్ బాక్సాఫీస్ స్టామినా పెరగడానికి పాన్ ఇండియా సినిమాలే కాకుండా మల్టీస్టారర్ సినిమాలు కూడా చాలానే ఉపయోగపడతాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో RRR సినిమా బిగెస్ట్ బడ్జెట్లో మల్టీస్టారర్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో అంతకుమించి అనేలా మరో మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా శంకర్ డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

థియేటర్స్ లో మాస్టర్ హంగామా (ఫొటోలు)

RRR తరహాలోనే..మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు

RRR తరహాలోనే..మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు

రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. ఈ సినిమా కోసం మెగా నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన 85% షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ ఏడాది దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. RRR తరహాలోనే మరికొన్ని మల్టీస్టారర్ ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం.

శంకర్ దర్శకత్వంలో..

శంకర్ దర్శకత్వంలో..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోక బిగెస్ట్ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అది కూడా సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రూమర్ ఎప్పుడు ఎక్కడ మొదలైందో గాని సౌత్ ఇండస్ట్రీలో మాత్రం వైరల్ గా మారింది.

పవర్ స్టార్ తో రామ్ చరణ్..

పవర్ స్టార్ తో రామ్ చరణ్..

లాక్ డౌన్ లోనే కొన్ని కథలను సెట్ చేసుకున్న డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నాడు. చాలా కాలంగా తెలుగు హీరోలతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు గాని వర్కౌట్ కావడం లేదు. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఒక స్టోరీ సెట్టయినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైనట్లు టాక్ వస్తోంది.

మెయిన్ లీడ్.. ఎవరంటే?

మెయిన్ లీడ్.. ఎవరంటే?

రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ లీడ్ లో కనిపిస్తాడట. ఇక పవన్ మాత్రం సెకండ్ హాఫ్ లో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా రూమర్ నిజమైతే అభిమానులకు పండగే అనే చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X