»   » రామ్ చరణ్ కోసం గ్రామీణ తెలుగు అమ్మాయి

రామ్ చరణ్ కోసం గ్రామీణ తెలుగు అమ్మాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్, వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. కృష్ణ వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కోసం హీరోయిన్స్ వేట జరుగుతోంది. రామ్ చరణ్ సరసన నటించే అమ్మాయి...తెలుగు అమ్మాయి...అయితే బాగుంటుందని దర్శకుడు బావిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఆమె కథ ప్రకారం సంప్రదాయ గ్రామీణ తెలుగు అమ్మాయిగా కనపడాలని దర్శక,నిర్మాతలు అలాంటి ఫేస్ కోసం గత కొద్ది రోజులుగా అన్వేషిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించనున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ స్లిమ్ లుక్‌లో సరికొత్తగా కనిపించనున్నారు. కృష్ణ వంశీ తనదైన స్టైల్‌లో సినిమాను తెరకెక్కించబోతున్నారు. సినిమాలో రామ్ చరణ్‌కు సంబంధించిన లుక్ ఇదే అంటూ నెట్లో ఓ ఫోటో కూడా హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం డిసెంబర్లో జరుగనుందని తెలుస్తోంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరనుంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు కృష్ణ వంశీ.

మరో ప్రక్క ఎంతో కాలంగా రామ్‌చరణ్‌ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 19 న విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించారు.

దిల్ రాజు మాట్లాడుతూ...మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఎవడు. ఈ చిత్రానికి సంభందించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసాము. మా ఎవడు చిత్రాన్ని డిసెంబర్ 19 న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, శ్రుతి హాసన్, అమి జాక్సన్ అందాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ,దర్శకుడు వంశీ పైడిపల్లి సూపర్బ్ టేకింగ్, ఈ చిత్రానికి హైలెట్స్ కాగా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ పాత్రలు హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రం మెగా అభిమానులకు పండుగ వాతావరణం కల్పించటమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 19 న ప్రపంచవ్యాప్తంగా అత్యథిక థియోటర్స్ లో విడుదల అవుతుంది అన్నారు.

English summary
Ram Charan will be paired opposite a new face in Krishna Vamsi’s film. Director Krishna Vamsi is looking a pucca traditional looking girl for this role. She should have a rural telugu girl kind of look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu