నితిన్‌తో లిప్‌లాక్‌ సీన్లు చేయించేందుకు సిద్ధమవుతున్న క్రేజీ డైరెక్టర్?

By Bojja Kumar

Recommended Video

RX 100 Movie Director Ajay Bhupathi About To Join With Nithin

'ఆర్ఎక్స్ 100' సినిమా విడుదల తర్వాత దర్శకుడు అజయ్ భూపతికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి డిమాండ్ ఏర్పడింది. తొలి సినిమాలో రొమాంటిక్ సీన్లను అతడు హ్యాండిల్ చేసిన విధానం.... బోల్డ్ సీన్లను పచ్చిగా ప్రజంట్ చేస్తూనే అసభ్యత లేకుండా తెరపై చూపించిన అతడి టాలెంట్‌ను అందరూ అభినందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అజయ్ భూపతి తన రెండో సినిమాను హీరో నితిన్‌తో చేయబోతున్నట్లు సమాచారం.

నితిన్ తండ్రి ప్రయత్నాలు

నితిన్ తండ్రి ప్రయత్నాలు

ప్రముఖ నిర్మాత, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి.... అజయ్ భూపతితో ఇప్పటికే సంప్రదింపులు జరిపాడని, నితిన్ బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే కథ కూడా ఉండటంతో డీల్ ఓకే అయినట్లు తెలుస్తోంది. అయితే సినిమా ప్రారంభం అయ్యే వరకు దర్శకుడి పేరు బయట పెట్టకుండా సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నాడ సుధాకర్ రెడ్డి.

 తన రెండో మూవీలోనూ ముద్దు సీన్లు?

తన రెండో మూవీలోనూ ముద్దు సీన్లు?

తాను యూత్‌ను టార్గెట్ చేసే సినిమాలు చేస్తానని... ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించే డ్రామాలు చేయబోనని ఇటీవల ఇంటర్వ్యూలో అజయ్ భూపతి తెలిపారు. దీన్ని బట్టి తన రెండో సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిన్ సన్నివేశాలు తప్పకుండా ఉండేలా అజయ్ భూపతి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముద్దు సీన్లకు నితిన్‌ను ఒప్పించాడా?

ముద్దు సీన్లకు నితిన్‌ను ఒప్పించాడా?

హీరో నితిన్ ఇప్పటి వరకు తన సినిమాల్లో ఘాటైన లిప్ లాక్ ముద్దు సీన్లు చేయలేదు. ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ రేటు లేని నితిన్ కాస్త తెగింపుగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నాడా? అజయ్ భూపతితో చేయబోయే సినిమాలో ముద్దు సీన్లు చేయబోతున్నాడా? అనేది హాట్ టాపిక్ అయింది.

శ్రీనివాస కళ్యాణంలో నితిన్ బిజీ

శ్రీనివాస కళ్యాణంలో నితిన్ బిజీ

ప్రస్తుతం నితిన్ శ్రీనివాస కళ్యాణం మూవీలో బిజీ బిజీగా ఉన్నాడు. దిల్ రాజు బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్. శతమానం భవతి లాంటి హిట్ చిత్రాన్ని అందించిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X