twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maha samudram : ఆర్ఎక్స్100 డైరెక్టర్ యూటర్న్.. ఈసారి మొత్తం రివర్స్.. రిస్క్ అయినా తగ్గకుండా!

    |

    తెలుగులో ఏడాదికి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఆ సినిమా రిలీజ్ అయి ఏళ్లు గడుస్తున్నా ఆ సినిమాకు సంబంధించిన నటీనటులు దర్శకుల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంటుంది.

    అలాగే సరిగ్గా మూడేళ్ల క్రితం ఆర్ఎక్స్100 అనే ఒక బోల్డ్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి.. వర్మ శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు మొదటి సినిమాతోనే శభాష్ అనిపించుకున్నారు.. అయితే ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది ఆ వివరాల్లోకి వెళితే..

    బోల్డ్ అటెంప్ట్ తో

    బోల్డ్ అటెంప్ట్ తో

    కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా ప్రస్తావించ అక్కర్లేదు.. ఈ సినిమా పాటలు మొదలు సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అందుకే ఈ సినిమాను బీభత్సంగా ఆదరించారు. మునుపెన్నడూ చేయని బోల్డ్ అటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజయ్ భూపతి ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు.

    రెండేళ్ళు సైలెంట్

    రెండేళ్ళు సైలెంట్

    నిజానికి ఈ సినిమా ద్వారా వచ్చిన పేరుతో ఒకపక్క హీరో కార్తికేయ అలాగే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా ప్రకటించడానికి దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆయన రాసుకున్న కథకు ఇద్దరు హీరోలు కావాలి. ఆ ఇద్దరు హీరోల కోసం వెతుకుతూ ఆయన దాదాపు రెండేళ్ల సమయం గడిపేశాడు.

    చివరికి వాళ్లతో

    చివరికి వాళ్లతో

    మాస్ మహారాజా రవితేజ, అక్కినేని నాగచైతన్య లాంటి హీరోలకి కధ చెప్పి వాళ్ళ కోసం కాలం గడిపేశారు. చాలా రోజుల పాటు ఆయన సినిమా అనౌన్స్ చేస్తాడని అందరూ భావించారు కానీ ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక లాభం లేదనుకున్నారో ఏమో కొన్నాళ్లపాటు వేచి చూసి చివరికి శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాని అనౌన్స్ చేశాడు.. ఇది నాగచైతన్య, రవితేజలు వద్దనుకున్న సబ్జెక్టే అనే ప్రచారం ఉంది.

     వైజాగ్ నేపథ్యంలో

    వైజాగ్ నేపథ్యంలో

    ఇక సినిమా విషయానికి వస్తే ఈ మహా సముద్రం సినిమాలో శర్వానంద్ సిద్ధార్థ ఇద్దరూ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే అను ఇమ్మానుయేల్. అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ లాంటి వాళ్లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

    ఈసారి యూటర్న్

    ఈసారి యూటర్న్

    అజయ్ భూపతి మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 సినిమాలో ప్రేయసి చేతిలో మోసపోయిన ప్రియుడి కథను ఆయన ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి కథే ఉండబోతుందట. కానీ ఈసారి బాధపడేది, మోసపోయింది మాత్రం హీరోయిన్ అని అంటున్నారు. మొదటి సినిమాకి పూర్తి భిన్నంగా రెండో సినిమాను తెరకెక్కిస్తున్నారు అని అంటున్నారు. అంటే మొదటి సినిమాలోనే వైలెంట్ లవ్ స్టోరీనే కానీ ఇక్కడ అ మోసపోయే జెండర్ ను మాత్రం మారుస్తున్నారని తెలుస్తోంది.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
    మళ్ళీ రిస్క్

    మళ్ళీ రిస్క్

    ఇక ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న శర్వానంద్, సిద్ధార్థ ఇద్దరూ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఒకరితో ఒకరికి అసలు పడని క్యారెక్టర్లలో నటిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగు సినిమా తీయడం అనేది కాస్త రిస్క్ తో కూడుకున్న పనే కానీ మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100లో హీరోయిన్ ను అలా చూపించడం విషయంలో రిస్క్ చేసిన అజయ్ ఈ విషయంలో కూడా రిస్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.

    English summary
    Director Ajay Bhupathi of RX 100 fame is coming up next with Maha Samudram after a long gap. The latest updates on the movie suggest the director taking a U-turn story-wise. Maha Samudram starring Sharwanand and Siddharth in the lead roles is going to be a violent love story like RX 100. But here, instead of the hero, it is the heroine who seems to be sufferd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X