బాయ్ ఫ్రెండ్ గోల తట్టుకోలేక.. హాట్ హీరోయిన్ బ్రేకప్ చెప్పిందా?

హీరోయిన్స్ కెరీర్ లో రూమర్స్ రావడం కామన్ అని అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుత రోజుల్లో చిన్న గాసిప్ వచ్చినా నిజానిజాలు తెలుసుకోకుండా ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. మెయిన్ గా ఎఫైర్స్, లవ్ రూమర్స్ కారణంగా సెలబ్రెటీలు చాలా ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు అయితే వాటి గురించి ఏ మాత్రం పట్టించుకోరు. ఇక చాలా రోజుల తరువాత పాయల్ రాజ్ పుత్ కూడా కొన్ని రూమర్స్ కారణంగా చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది.

 స్ట్రాంగ్ ఎంట్రీ..

స్ట్రాంగ్ ఎంట్రీ..

28 ఏళ్ల పాయల్ రాజ్ పుత్ అంటే తెలియని తెలుగు ఆడియెన్ ఉండడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. మొదటి సినిమాలోనే రిస్కీ రోల్ చేసిన అమ్మడు తన అసలైన యాక్టింగ్ స్కిల్స్ ని చూపించి ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేసింది.ఇక అదే రేంజ్ లో ఆకట్టుకునేందుకు మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

బాయ్ ఫ్రెండ్ తో..

బాయ్ ఫ్రెండ్ తో..

పాయల్ రాజ్ పుత్ మొదటి నుంచి తన పర్సనల్ లైఫ్ విషయంలో ఓపెన్ గానే ఉంటోంది. రూమర్స్ కి తావివ్వకుండా బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్నట్లు క్లారిటీ ఇస్తూ వస్తోంది. అతని పేరు సౌరబ్ డింగ్రా. అప్పుడప్పుడు తన లవర్ ని అమ్మడు సినిమా ఈవెంట్స్ కి కూడా తీసుకొస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా రొమాంటిక్ లైఫ్ గురించి ఎదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

బ్రేకప్ చెప్పేసిందా?

బ్రేకప్ చెప్పేసిందా?

పాయల్ రాజ్ పుత్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనగానే చాలా మంది కుర్రాళ్ల గుండెలు బద్దలయ్యాయి. ఇకపోతే రీసెంట్ గా ఆమె లవ్ మ్యాటర్ కి సంబంధించిన రూమర్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే పాయల్ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది అంటూ ఓ వర్గం నెటీజన్స్ తెగ ప్రచారాలు చేస్తున్నారు. ఒక విషయంలో ఇద్దరికి గొడవ వచ్చిందని.. అతని గోల తట్టుకోలేక హాట్ బ్యూటీ బ్రేకప్ చెప్పినట్లు టాక్ వస్తోంది.

Recommended Video

90ml Director Shekar Reddy Exclusive Interview
అన్ని పుకార్లే..

అన్ని పుకార్లే..

బ్రేకల్ వార్తలు విన్న మరికొంత మంది పాయల్ ఫాలోవర్స్ ఓ విధంగా షాక్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అమ్మడు ఎప్పటికప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటిది సడన్ గా బ్రేకప్ వార్తలు రావడం ఓ విధంగా ఆశ్చర్యాన్ని కలోగిస్తోంది. నిజానికి ఇవన్నీ పుకార్లే అంటూ ఆమె రెగ్యులర్ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X