చరణ్ మూవీలో ఊహించని పాత్రలో స్టార్ డైరెక్టర్.. కథను మలుపు తిప్పేది ఆయనేనట

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే తనదైన ముద్రను వేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంటున్నాడు. తద్వారా తన ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటున్నాడు. దీనికితోడు విజయాలు కూడా సొంతం అవుతుండడంతో చరణ్ మరింత జోష్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. అయితే, ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన మరో చిత్రం 'ఆచార్య' మాత్రం భారీ డిజాస్టర్‌ అయింది. ఈ ఫలితాన్ని పట్టించుకోకుండా రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండానే చిత్రీకరణను జరుపుతున్నారు.

S. J. Suryah Key Role in Ram Charan and S. Shankar Movie

దిగ్గజ దర్శకుడు శంకర్ రూపకల్పనలో రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక, త్వరలోనే ఈ సినిమా క్లైమాక్స్ పార్టును షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారని ఫిలిం నగర్ ఏరియాలో భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. దీనితోపాటే ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఓ ఆసక్తికరమై అంశం బయటకు వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఉన్నత విలువలతో రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నటించే విలన్ పాత్రధారి గురించి చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఆ మధ్యనే ఇందులో ప్రముఖ దర్శకులు ఎస్‌జే సూర్య విలన్‌గా చేస్తున్నాడని ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి కుమారుడిగా చేస్తున్నాడట. ఆ పాత్ర ఎవరూ ఊహించని విధంగా సినిమాను మలుపు తిప్పుతుందని తెలిసింది. దీంతో ఎస్‌జే సూర్య రోల్‌పై ఆసక్తి నెలకొంది.

భారీ బడ్జెట్‌తో రాబోతున్న రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X