RC15: రామ్ చరణ్ మూవీలో విలన్‌గా స్టార్ డైరెక్టర్.. ఆయననే ఎందుకు తీసుకుంటున్నారంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న బడా హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. పేరుకు చిరంజీవి తనయుడే అయినా.. అద్భుతమైన టాలెంట్లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్నాడు. అదే సమయంలో ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. 'వినయ విధేయ రామ' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చరణ్.. ఇకపై వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే నటించిన రెండు చిత్రాలు రాకముందే దిగ్గజ దర్శకుడు శంకర్‌తో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు. తాజాగా దీని నుంచి షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఆ సంగతులు మీకోసం!

రెండు భారీ ప్రాజెక్టుల్లో మెగా హీరో
మెగా హీరో రామ్ చరణ్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రుధిరం రణం)లో ఎన్టీఆర్‌తో కలిసి చేశాడు. తెలుగు సినీ చరిత్రలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా నటించారు. దీనితో పాటు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య'లోనూ చరణ్ కీలక పాత్రను చేశాడు.

దిగ్గజ దర్శకుడితో చరణ్ సినిమా
ఆచార్య, RRR మూవీలు విడుదల కాకముందే రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి చాలా కాలం పాటు చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు కూడా తెరపైకొచ్చాయి. కానీ, ఊహించని విధంగా అతడు.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. భారీగా రాబోయే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తొలిసారి ఆ డైరెక్టర్ పక్కా ప్లాన్‌తో
శంకర్ సినిమా పూర్తవడానికి చాలా కాలం పడుతుంది. అయితే, చరణ్‌తో చేసే సినిమా కోసం మాత్రం ఆయన అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారు. అలాగే, ప్రారంభానికి ముందే కాస్టింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఇలా ఇప్పటికే దీని కోసం జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి వంటి వాళ్లను ఎంపిక చేశారు. అలాగే, థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని కూడా సెలెక్ట్ చేసుకున్నారు.

వైభవంగా మొదలు.. స్పీడుగానే
రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఇది నేషనల్ లెవెల్‌లో హైలైట్ అయింది. అంతేకాదు, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎంతో స్పీడుగా ముందుకు సాగుతోంది.

విలన్ రోల్ విషయంలో పుకార్లు
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నటించే విలన్ పాత్రధారి గురించి చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, క్లారిటీ మాత్రం రావడం లేదు.

చరణ్‌కు విలన్‌గా స్టార్ డైరెక్టర్
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో నటించే విలన్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌జే సూర్య నెగెటివ్ రోల్‌ను చేస్తున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని అంటున్నారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది.

ఆయనకు ఎందుకు ఓటేశారు?
రామ్ చరణ్‌తో చేస్తున్న సినిమాలో విలన్‌గా శంకర్.. డైరెక్టర్ ఎస్‌జే సూర్యకే ఓటు వేశారట. దీనికి కారణం.. ఆయనకు తెలుగు, తమిళంలో అభిమానులు ఉండడమే అని తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల 'మానాడు' మూవీలోనూ ఆయన తనదైన విలనిజాన్ని పండించారు. దీంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నారు. అందుకే చరణ్ కోసం ఆయనను దింపుతున్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











