RRR యూనిట్‌పై రాజమౌళి ఫైర్.. ఎన్టీఆర్ కారణంగా ఫుల్ సీరియస్!

ప్రతిష్టాత్మక సినిమా RRR ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. రేయింబవళ్లు రాజమౌళి సహా చిత్రయూనిట్ అంతా కలిసి ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇంతలో ఓ అనుకోని పరిణామం చోటు చేసుకోవడంతో చిత్రయూనిట్‌పై రాజమౌళి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. పైగా ఇందుకు కారణం ఎన్టీఆర్ మాత్రమే అని టాక్. ఆ వివరాలేంటో చూద్దామా..

 ప్రెస్‌మీట్ పెట్టాడు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్

ప్రెస్‌మీట్ పెట్టాడు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్

RRR సినిమా మొదలుపెట్టినపుడే ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్పిన రాజమౌళి ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు కానీ చిత్రానికి సంబంధించిన ఎలాంటి లుక్స్ బయటకు వదల్లేదు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉంటాయనే దానిపై మెగా, నందమూరి అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఎన్టీఆర్ కొమురం భీం లుక్‌ లీక్..

ఎన్టీఆర్ కొమురం భీం లుక్‌ లీక్..

ఈ పరిస్థితుల నడుమ ఎన్టీఆర్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో సెట్స్ పై కొమురం భీం లుక్‌లో కనిపిస్తున్నారు ఎన్టీఆర్. రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేష‌న్ సెట్ వేసి తీసిన సన్నివేశాలోనిది ఈ లుక్ అని తెలుస్తోంది. ఏదేమైనా కొమరం భీం లుక్‌లో ఎన్టీఆర్ వావ్! అనిపించాడు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది.

 రాజమౌళి సీరియస్.. ఏంటిది అంటూ ఫైర్

రాజమౌళి సీరియస్.. ఏంటిది అంటూ ఫైర్

దీంతో ఈ లీక్ గురించి తెలిసి రాజమౌళి.. RRR చిత్రయూనిట్ పై సీరియస్ అయ్యారట. సెట్స్ పై లీకులు జరగకుండా కెమెరాల నిషేధం లాంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇలా లీక్ ఎలా అయ్యిందంటూ టీం అందరిపై ఫైర్ అయ్యారట జక్కన్న. మొత్తానికైతే ఇది ఎన్టీఆర్ అఫీషియల్ లుక్ కాకపోయినప్పటికీ నందమూరి అభిమానులకు కనువిందుగా మారింది.

 సర్వ హంగులు.. ఓ వైపు రాజమౌళి మరోవైపు డీవీవీ దానయ్య

సర్వ హంగులు.. ఓ వైపు రాజమౌళి మరోవైపు డీవీవీ దానయ్య

తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో భారీ ఎత్తున RRR విడుదల కానుంది. సర్వ హంగులతో జక్కన్న తీర్చిదిద్దుతున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిత్రానికి 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అతి త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
ఇద్దరు హీరోయిన్లు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ రోల్స్

ఇద్దరు హీరోయిన్లు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ రోల్స్

1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X