RRR రేంజ్ ఇదా? రాజమౌళి స్కెచ్ చూస్తే మతిపోవాల్సిందే మరి!
బాహుబలి లాంటి భారీ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ కొట్టేసిన రాజమౌళి.. తన తర్వాతి సినిమా RRR కోసం పకడ్బందీ స్కెచ్ వేశారని తెలుస్తోంది. మెగా, నందమూరి అభిమానులకు ఏక కాలంలో స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న జక్కన్న.. ఈ సినిమాను భూత, భవిష్యత్ కాలాల్లో ఓ మైలురాయిగా నిలపాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఆయన ప్రయత్నాలు సాగుతున్నాయని టాక్.

RRR రేంజ్ ఇదా?
భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న RRR సినిమాకు సర్వ హంగులు అద్దుతున్నారట రాజమౌళి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న ఆయన.. సినిమా విడుదలయ్యాక RRR రేంజ్ ఇదా? అని అంతా ఆశ్చర్యపోయేలా చేయాలని భావిస్తున్నారట. ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఈ సినిమా ఉండాలని రాజమౌళి స్కెచ్ వేశారట.

అప్పుడు ఇప్పుడు.. ఎప్పుడైనా
ఇప్పటికే బాహుబలి సిరీస్ తో రికార్డులు తిరగరాశారు జక్కన్న. తిరిగి ఇప్పుడు RRR సినిమాతో తన రికార్డులను తానే తిరగరాసేలా ఆయన ప్లాన్స్ ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. షూటింగ్ స్టైల్, కథ ప్రకారంగా అంచనా వేస్తే గతంలో, భవిష్యత్‌లో RRR లాంటి సినిమా చూసి ఉండం, చూడలేరు కూడా అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

జీవితకాలం గుర్తుండిపోయే మూవీ
ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, రికార్డులు సృష్టిస్తుంటాయి. కానీ జీవితకాలం గుర్తుండిపోయే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి సినిమానే RRR అయ్యేలా రాజమౌళి ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా, అదేవిధంగా ప్రతీ వ్యక్తికీ జీవితకాలం గుర్తుండిపోయేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారట జక్కన్న.

చెర్రీతో బాలీవుడ్ భామ.. ఎన్టీఆర్‌తో హాలీవుడ్ బ్యూటీ
వచ్చే ఏడాది జులై నెలాఖరుకు విడుదల టార్గెట్‌గా పెట్టుకున్న RRR మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా, రీసెంట్‌గా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ను సెలెక్ట్ చేశారు రాజమౌళి.

మెగా, నందమూరి అభిమానులకు కనువిందు
1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా కావడంతో RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్సులు మిస్ అవుతామేమో అని భావించారు వారి వారి ఫ్యాన్స్. కానీ మెగా, నందమూరి అభిమానులకు కనువిందు చేసేలా ఏడు పాటలు, హోరెత్తిపోయే డాన్సులు కూడా రూపొందిస్తున్నారట జక్కన్న.

RRR మూవీ
ప్రతిష్టాత్మక RRR చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30 వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











