twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా సర్‌ప్రైజ్.. రంగంలోకి రాజమౌళి.. 'సైరా నరసింహా రెడ్డి'కి జక్కన్న సహకారం!

    |

    Recommended Video

    Rajamouli Support For Sye Raa Narasimha Reddy || సైరా నరసింహా రెడ్డి'కి జక్కన్న సహకారం

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూనిట్ సభ్యులంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సరిగ్గా ఈ సమయంలో ఈ భారీ ప్రాజెక్టులోకి రాజమౌళి ఎంటర్ అవుతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ 'సైరా' కోసం రాజమౌళి చేసేదేంటి? వివరాల్లోకి పోతే..

    మెగాస్టార్ 151.. భారీ రేంజ్ మూవీ

    మెగాస్టార్ 151.. భారీ రేంజ్ మూవీ

    ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వచ్చి రాగానే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో తన 151 సినిమా విషయమై ఎంతో జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని 'సైరా నరసింహా రెడ్డి' పూర్తి చేశారు. చారిత్రాక నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం చిరంజీవి సరికొత్తగా మేకోవర్ అయ్యారు.

    పులితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భీకర పోరు.. నందమూరి అభిమానులకు కనువిందే!పులితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భీకర పోరు.. నందమూరి అభిమానులకు కనువిందే!

    రంగంలోకి రాజమౌళి.. అసలు ట్విస్ట్ ఇదే

    రంగంలోకి రాజమౌళి.. అసలు ట్విస్ట్ ఇదే

    బాహుబలి లాంటి భారీ సినిమా రూపొందించిన క్రెడిట్, అప్పటి మాహిష్మతి రాజ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిన అనుభవం ఉన్న కారణంగా రాజమౌళి సహకారం కోరిందట 'సైరా' యూనిట్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కావడంతో ఎడిటింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆయన సలహా, సూచనలు కావాలని రిక్వెస్ట్ చేశారట దర్శకనిర్మాతలు.

    జక్కన్న కోసం ప్రత్యేక షో

    జక్కన్న కోసం ప్రత్యేక షో

    ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన 'సైరా' మేకింగ్ రాజమౌళికి చూపించేందుకు ప్రత్యేక షో ఏర్పాటు చేశారని సమాచారం. జక్కన్న సలహా, సూచనలు తప్పనిసరి అని భావించి ఈ ప్లాన్ చేశారని తెలుస్తోంది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కారణంగా జక్కన్న కూడా ఇందుకు ఓకే చెప్పేశారని, దీంతో ఆ ఏర్పాట్లు ముమ్మరం చేశారని ఫిలింనగర్ టాక్.

    బల్గెరియాలో రాజమౌళి.. ఎన్టీఆర్, చెర్రీలతో

    బల్గెరియాలో రాజమౌళి.. ఎన్టీఆర్, చెర్రీలతో

    మరోవైపు RRR సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ బల్గెరియా షెడ్యూల్‌లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది జులై 31న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు.

    'సైరా నరసింహా రెడ్డి' మూవీ

    'సైరా నరసింహా రెడ్డి' మూవీ

    ఇక 'సైరా నరసింహా రెడ్డి' మూవీ విశేషాలు చూస్తే.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది ఈ సినిమా. చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy movie creating sensations before release. As per latest talk this movie pre release event will be very much grandly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X