ప్రభాస్‌పై కక్ష గట్టిన బాలీవుడ్ దర్శకుడు.. పీకల్లోతు కష్టాల్లో సాహో!

By Rajababu

Recommended Video

Karan Johar Comments on Prabhas

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు తెలుస్తున్నది. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహర్ మధ్య ఉన్న కోల్డ్‌వార్ అందుకు కారణమని తెలుస్తున్నది.

కరణ్‌తో విభేదాలు

కరణ్‌తో విభేదాలు

ప్రభాస్, కరణ్ జోహార్ మధ్య ఉన్న విభేదాల కారణంగానే సాహో చిత్రాన్ని ఉత్తరాది నిర్మాతలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదట. ప్రభాస్, కరణ్ మధ్య విభేదాలకు కారణమేమిటంటే..

భారీ బడ్జెట్‌తో సాహో

భారీ బడ్జెట్‌తో సాహో

బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగి పోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సాహోను భారీ బడ్జెట్‌తోపాటు అత్యంత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే సుమారు రు. 30 కోట్లు ఖర్చు చేశారనేది సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ముఖం చాటేస్తున్న బాలీవుడ్

ముఖం చాటేస్తున్న బాలీవుడ్

అత్యంత ప్రతిష్ఠాతక్మంగా రూపొందిస్తున్న సాహో చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఉత్తరాది బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. కరణ్‌తో సాహో విభేదాలే వారిని వెనకంజ వేసేలా చేస్తున్నాయట.

ప్రభాస్ రెమ్యునరేషన్ విని షాక్

ప్రభాస్ రెమ్యునరేషన్ విని షాక్

ప్రభాస్, కరణ్ జోహర్ మధ్య నెలకొన్న విభేదాలకు అసలు కారణంపై ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో కరణ్ జోహార్ ఓ సినిమా ప్లాన్ చేశారట. ఆ సినిమాకు ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించారట. కానీ ప్రభాస్ చెప్పిన రేటు విని కరణ్ షాకయ్యాడట. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. దాంతో కరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడనేది బాలీవుడ్ పత్రికల కథనం.

వెనక్కి తగ్గిన కరణ్ జోహర్

వెనక్కి తగ్గిన కరణ్ జోహర్

బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాడు. అందుకోసం ప్రభాస్‌ను సంప్రదించగా... 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కరణ్ వెనక్కి తగ్గాడట.

రజనీకాంత్‌కు మించి

రజనీకాంత్‌కు మించి

ప్రభాస్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ సల్మాన్ ఖాన్‌కు మంచి ఉందని, అంతేకాకుండా దక్షిణాదిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా లేదనే వార్తలు మీడియాలో ప్రచారం అయ్యాయి. ప్రభాస్ అడిగే రెమ్యునరేషన్ సరికాదు అని మాట వినిపించింది.

బాలీవుడ్ హిందీ సినిమా క్లోజ్

బాలీవుడ్ హిందీ సినిమా క్లోజ్

ప్రభాస్ అధికంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కరణ్ జోహర్ ఆ ప్రాజెక్ట్‌ను వాయిదా వేసుకొన్నాడు. దాంతో ప్రభాస్‌, కరణ్ మధ్య విభేదాలు నెలకొన్నాయి.

ప్రభాస్‌పై కరణ్ జోహర్ సెటైర్

ప్రభాస్‌పై కరణ్ జోహర్ సెటైర్

ప్రభాస్‌తో ప్రాజెక్ట్ క్లోజ్ అయిందనే వార్తల నడుమ.. కరణ్ జోహర్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. డియర్ యాంబిషన్.. నీవు ఏదైనా ఘనత సాధించాలంటే పేరున్న దిగ్గజాలతో పోల్చుకోవడం తగ్గించుకోవాలి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X