For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ మొదటికి వచ్చిన ‘సాహో’ డైరెక్టర్.. ప్రభాస్ లేకపోతే పరిస్థితి ఏంటో..

By Lekhaka
|

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే, ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవలేకపోయింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు సుజిత్ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇప్పటి వరకు ఆయన మరో సినిమాను ప్రారంభించలేదు. దీంతో అతడి కెరీర్ ప్రశ్నార్ధకం అవుతుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో సుజిత్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

టాక్ బాగోకున్నా కలెక్షన్లు మాత్రం భారీగా

టాక్ బాగోకున్నా కలెక్షన్లు మాత్రం భారీగా

సాహోకు ప్రీమియర్ షోల సమయంలో మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన రోజు రెండో ఆట నుంచి టాక్ మారిపోయింది. దీంతో మిశ్రమ స్పందనే ఈ చిత్రం పరిమితమైంది. అయినప్పటికీ సాహో కలెక్షన్ల పరంగా దూసుకుపోయిందని ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైచిలుకు వసూలు చేసిందని ప్రకటించారు.

ఇప్పటి వరకు సాహోదే ఆ రికార్డు

ఇప్పటి వరకు సాహోదే ఆ రికార్డు

ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో' 2019 సంవత్సరానికి గానూ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోని బడా హీరోల రికార్డులు బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 400 కోట్లు వసూళు చేయడంతో.. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కబీర్ సింగ్ రికార్డులు కనుమరుగైపోయాయి. అంతకుముందు కబీర్ సింగ్ రూ. 278 కోట్లు కలెక్ట్ చేయగా, సల్మాన్ ఖాన్ భారత్ రూ. 211 కోట్లు, అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ రూ. 188 కోట్లు వసూలు చేశాయి. వీటిని ఇప్పుడు సాహో అధిగమించింది.

ప్రభాస్ బిజీ.. సుజిత్ పరిస్థితేంటి?

ప్రభాస్ బిజీ.. సుజిత్ పరిస్థితేంటి?

సాహో సినిమా ఫలితంతో ఢిలా పడింది ఆ సినిమా యూనిట్. అయినప్పటికీ, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు. గతంలో ప్రకటించిన ‘జాన్' సినిమా షూటింగ్‌లో అతడు త్వరలోనే పాల్గొనబోతున్నాడు. ‘జిల్' ఫేం రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా 1980 దశకంలోని లవ్ స్టోరీగా రూపొందనుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డె నటిస్తోంది. మరోవైపు, సుజిత్ మాత్రం ఇంకా ఏ సినిమాను ప్రకటించలేదు.

మొదటికి వచ్చిన సుజిత్

మొదటికి వచ్చిన సుజిత్

యంగ్ డైరెక్టర్ సుజిత్.. శర్వానంద్‌కు ఇటీవల ఓ కథను చెప్పాడట. దీనికి అతడు కూడా ఓకే చెప్పేశాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘రన్ రాజా రన్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. శర్వా ప్రస్తుతం ‘96' తెలుగు రీమేక్‌తో పాటు ‘శ్రీకారం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు పూర్తయిన వెంటనే సుజిత్‌ సినిమాను పట్టాలెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది.

సుజిత్‌కు ప్రభాస్ ఆఫర్

సుజిత్‌కు ప్రభాస్ ఆఫర్

‘సాహో' డైరెక్టర్ సుజిత్ గురించి గతంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ‘సాహో' హిట్ అయితే తనకు ఎన్నో ఆఫర్లు వస్తాయి కానీ, ఒకవేళ ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అని సుజిత్.. ప్రభాస్‌తో అన్నాడట. దీనికి యంగ్ రెబెల్ స్టార్.. ‘సినిమా హిట్ అయితే నువ్వు స్టార్ డైరెక్టర్ అయిపోతావు. ఒకవేళ ఫ్లాప్ అయి నీకు ఆఫర్లు రాకపోతే నేనే మళ్లీ సినిమా చేస్తా' అని హామీ ఇచ్చాడని ప్రచారం జరిగింది.

#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
ప్రభాస్ సాయంతోనే సినిమా

ప్రభాస్ సాయంతోనే సినిమా

ఇక, శర్వానంద్‌తో సుజిత్ సినిమా ప్లాన్ చేయడానికి కారణం ప్రభాసేనని కూడా వార్తలు వస్తున్నాయి. తన స్నేహితులు ఏర్పాటు చేసిన యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాకు ప్రభాస్ నిర్మాణ పరమైన బాధ్యతలు ఏమీ తీసుకోకున్నా.. తన స్నేహితులకు అప్పగించాడని ప్రచారం జరుగుతోంది.

English summary
Sujeeth Reddy is a Telugu Indian film director and writer. He made his directorial debut in the Telugu film industry with the romantic comedy thriller film Run Raja Run at the age of 23. He started making short films at the age of 17 and directed about 38 short films before entering Telugu cinema.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more