For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ ఆలస్యానికి అసలు కారణం ఆ ఒక్క సీనేనట

    |

    టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్ చిత్రం 'సాహో'. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. 'సాహో'ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమాను వాయిదా వేశారు.

    దీనికి సరైన కారణాలు అయితే తెలియలేదు కానీ, గ్రాఫిక్ వర్క్ చాలా మిగిలి ఉందని, అలాగే రీ రికార్డింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాకీ ఉందని కొందరు అంటున్నారు. అలాగే కొన్ని సీన్స్ విషయంలో దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడని, వాటిని రీ షూట్ చేయాలని భావిస్తున్నాడని ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీటన్నింటిపై చిత్ర యూనిట్ అయితే స్పందిచలేదు. అయితే, తాజాగా ఈ విషయానికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

    ప్రభాస్ కారణంగా వెనక్కి తగ్గిన నాని!

    Saaho Delay Reason Out

    ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారట. విదేశాల్లోని ఓ ఎడారిలో హాలీవుడ్‌కు చెందిన టెక్నీషియన్లతో ఈ ఫైట్ సీన్ రూపొందించారని తెలిసింది. షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత రష్ చూస్తే దర్శకుడు సుజిత్‌కు నచ్చలేదని సమాచారం. ఈ ఫైట్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ అంతగా బాగోకపోవడంతో అతడు నిరాశ చెందాడని టాక్. సినిమాకు ప్రాణమైన క్లైమాక్స్ ఫైట్ విషయాన్ని ఏమాత్రం లైట్ తీసుకోకూడదని భావించిన ఈ యంగ్ డైరెక్టర్.. వాటిని మరోసారి చేయాల్సిందిగా టీమ్‌కు చెప్పాడనే టాక్ వినిపిస్తోంది.

    ఈ వర్క్ కోసం సదరు టీమ్.. తమకు పది నుంచి పదిహేను రోజుల సమయం కావాలని అడిగారని ఇండస్ట్రీలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ కారణంగానే 'సాహో'ను వాయిదా వేశారని అంటున్నారు. మరోవైపు, రెండు రోజుల క్రితం 'సాహో' సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 30న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

    English summary
    Tollywood Young Hero Prabhas Now doing big project Saaho. This Movie Release In many languages. Some News Viral About Sahoo Release. This Film Was Delayed. Now Sahoo New Release Date Locked. he film has been directed by Sujeeth and produced by UV creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X