బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్లో సినిమాలు చేసే రిచేస్ట్ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ హీరో నెక్స్ట్ సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం తేడా ఉండదు. ఇక సక్సెస్ అనే టాక్ వస్తే చాలు ఆ సెలబ్రేషన్స్ హై రేంజ్ లో ఉంటాయి. ఇక చాలా రోజుల తరువాత బెల్లంకొండ బాబు అంతకు మించి అనేలా ఒక ప్లాన్ చేసుకుంటాడు.
గత కొన్ని రోజులుగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ హీరో హిందీ డబ్బింగ్ సినిమాలు కొన్ని యూ ట్యూబ్ లో 100మిలియన్లకు పైగా వ్యూవ్స్ ని అందుకున్నాయి. అసలు మ్యాటట్ లోకి వస్తే రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి బాక్సాఫీస్ హిట్ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రభాస్ పాత్రలో ఫిక్స్ అని టాక్ గట్టిగానే వస్తోంది.

ఇక దర్శకుడు ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో సాహో దర్శకుడు సుజిత్ అని మరో కొత్త టాక్ వైరల్ గా మారింది. అయితే ఆ దర్శకుడు ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు మరో కొత్త రూమర్ హాట్ టాపిక్ గా మారింది. ఇదివరకే మెగాస్టార్ లూసిఫర్ ని రీమేక్ చేయాలేనని చేతులెత్తేసిన సుజిత్ ఇప్పుడు ఛత్రపతి రీమేక్ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడని టాక్ వస్తోంది.
అసలు కారణం మరో సినిమా చర్చల్లో సుజిత్ బిజీగా ఉండడమేనని తెలుస్తోంది. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఛత్రపతిని హిందీలో ఎవరు రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. నిర్మాతలు బాలీవుడ్ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారనే న్యూస్ కూడా వస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











