twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో డైరెక్టర్ కు హీరో దొరికేశాడు.. ప్రభాస్ సలహతోనే లక్కీ ఛాన్స్?

    |

    సాహో సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని అనుకున్న యువ దర్శకుడు సుజిత్ కు చేదు అనుభవం మిగిల్చిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ఆ సినిమా భారీ స్థాయిలోనే విడుదలైనప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా కొన్ని నష్టాలను అయితే కలుగజేసింది. నిర్మాతలు అయితే దాదాపుగా సేఫ్ అయ్యారు గానీ చాలా ఏరియాల్లో బయ్యర్లు నష్టపోవాల్సి వచ్చింది.

    ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో డైరెక్టర్ సుజిత్ కు మరొక అవకాశం కూడా దొరకలేదు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ ను రీమేక్ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు అది కూడా మిస్ అయింది. ఇక చాలా కాలంగా ఈ దర్శకుడు తన మూడవ సినిమాను తెరపైకి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.

    Saaho director sujeeth another project in uv creations young hero fix

    ఆ మధ్య జి స్టూడియోస్ తో కలిసి ఒక బాలీవుడ్ హీరో తో సినిమా చేయడానికి చర్చలు కూడా జరిపారు. కానీ కరోనా కష్టకాలంలో ఆ సినిమా కూడా సెట్స్ పైకి రాలేకపోయింది. మొదట రన్ రాజా రన్ సినిమాతో సుజిత్ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే.

    ఆ సినిమా చూసిన తర్వాతనే ప్రభాస్ అతనికి సాహో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఇక సాహో సినిమా అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాకపోవడంతో అతనికి సరైన అవకాశాలు దొరకడం లేదు. ఇక ప్రస్తుతం మళ్ళీ శర్వానంద్ తోనే మరొక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన రన్ రాజా రన్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ యూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలోనే ప్రభాస్ సుజిత్ కు మరొక అవకాశం ఇవ్వాలి అని చెప్పడంతో శర్వానంద్ ను కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సుజిత్ చెప్పిన మరొక ఆసక్తికరమైన కథకు శర్వానంద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా సుజిత్ ఫామ్ లోకి వచ్చే అగ్ర హీరోలతో సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.

    English summary
    Saaho director sujeeth another project in uv creations young hero fix..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X