నా పైసలతో నేనే చేయిస్తా ఓపిక పట్టురా స్వామి.. ప్రభాస్ సినిమాపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

బాహుబలి లాంటి సినిమా తరువాత ప్రభాస్ నుంచి సినిమా వస్తోంది అంటే అంచనాలు అకాశాన్ని తాకడం కామన్ పాయింట్. అయితే సాహో సినిమా రిలీజ్ ముందు వరకు హైప్ బాగానే క్రియేట్ చేసింది కానీ.. రిలీజ్ అనంతరం సినిమా డిజాస్టర్ అయ్యింది. బాలీవుడ్ లో తప్పితే సినిమా ఎక్కడా కూడా పెట్టిన పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తేలేకపోయింది. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన డిలిటెడ్ సీన్స్ పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

డిలిటెడ్ సీన్స్ చాలానే ఉన్నాయట

డిలిటెడ్ సీన్స్ చాలానే ఉన్నాయట

సాహో సినిమా కమర్షియల్ గా నిర్మాతలను అయితే బాగానే సేవ్ చేసింది. అలాగే ఓ వర్గం ఆడియెన్స్ ని సినిమా బాగానే ఆకర్షించింది. అయితే అందులో డిలిటెడ్ సీన్స్ చాలానే ఉన్నాయట. ఖర్చులకు వెనక్కి తగ్గకుండా బాగానే షూట్ చేశారు గాని నిడివి ఎక్కువ కావడం వలన VFX వర్క్ స్టార్ట్ చేయకముందే కొన్ని కీలకమైన సీన్స్ ని కట్ చేయాల్సి వచ్చిందట.

డైరెక్టర్ సుజిత్ ని టార్గెట్ చేస్తూ..

డైరెక్టర్ సుజిత్ ని టార్గెట్ చేస్తూ..

ఇక ఆడియేన్స్ ఆ డిలిటెడ్ సీన్స్ కోసం చాలా రోజులుగా సోషల్ మీడియా ద్వారా యూవీ క్రియేషన్స్ ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు అప్డేట్స్ పైనే సరైన క్లారిటీ ఇవ్వరు.. ఇక కొత్త సీన్స్ పై ఎలా స్పందిస్తారని.. రెబల్ స్టార్ అభిమానులకు ఒక క్లారిటీ ఉంది. అందుకే డైరెక్టర్ సుజిత్ ని టార్గెట్ చేస్తూ.. ఎప్పుడు లైవ్ లోకి వచ్చిన ఆడిగేస్తున్నారు.

నా పైసలతో నేనే చేస్తా ఓపిక పట్టు..

నా పైసలతో నేనే చేస్తా ఓపిక పట్టు..

ఇక దర్శకుడు సుజిత్ ఫైనల్ గా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ఒక అభిమాని ఈ విదంగా అడిగాడు. సాహో డిలిటెడ్ సీన్స్ ఎప్పుడు ఇస్తావ్ అన్నా.. అంటూ ప్రశ్నించగా సుజిత్ కూడా అదే తరహాలో ఆన్సర్ ఇచ్చాడు. వోయ్.. అన్నో.. నేనే కదా ట్రై చేసి రిలీజ్ చేస్తా అన్నా.. సీన్ ఉంది రా స్వామి దానికి బేసిక్ VFX చేయించాలి. కోవిడ్ వల్ల ఆ కంపెనీ లేదు. నా పైసలతో నేనే చేస్తా ఓపిక పట్టు.. అంటూ సమాధానం ఇచ్చాడు.

Recommended Video

#HappyBirthdayPrabhas: He Is Rebel Star But Kind Hearted Darling, Real Baahubali|#BeatsofRadheShyam
రీమేక్ ఆఫర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుజిత్

రీమేక్ ఆఫర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుజిత్

దర్శకుడు సుజిత్ నిజంగా తన డబ్బులతో సీన్ ని రెడీ చేయించి రిలీజ్ చేస్తానని చెప్పడంతో అభిమానులు కొంత వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక దర్శకుడు సుజిత్ ఎలాంటి రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేయడం లేదని కూడా ఆన్సర్ ఇచ్చాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాను రీమేక్ చేసేందుకు సుజిత్ కి ఆఫర్ వచ్చినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సుజిత్ చేయడం లేదని క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలు అబద్ధమని క్లారిటీ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X