చిరంజీవి, ప్రభాస్ కాంబినేషన్‌లో మూవీ.. కథకు తుది మెరుగులు దిద్దుతోన్న యంగ్ డైరెక్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య సత్సంబంధాలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా మల్టీ స్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే, ఒక హీరో సినిమాను మరో హీరో ప్రమోట్ చేయడానికి వస్తున్నాడు. అంతేకాదు, సినిమా బాగుంటే అభినందించడం.. వీలైనంత సాయం చేయడం వంటివి కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఆ మూవీకి సంబంధించిన వివరాలు మీకోసం.!

కమ్‌బ్యాక్ మూవీతో అదరగొట్టిన మెగాస్టార్
చాలా ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా వెలుగొందారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. కొన్నేళ్లు ప్రజాసేవలో తరించిన ఆయన... ‘ఖైదీ నెంబర్ 150' మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ‘సైరా: నరసింహారెడ్డి' కూడా చేశారు.

రీఎంట్రీ తర్వాత స్పీడు పెంచిన చిరంజీవి
‘ఖైదీ నెంబర్ 150' తర్వాత చాలా రోజులకు ‘సైరా: నరసింహారెడ్డి' చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే, ఈ సారి వీలైనంత త్వరగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే చాలా మంది డైరెక్టర్లు చెప్పే కథలు వింటున్నాడు. వాటిలో ఏదైనా నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముగ్గురు, నలుగురు దర్శకులను లైన్‌లో పెట్టాడు చిరు.

బడా డైరెక్టర్‌తో కలిసి మెసేజ్ రెడీ చేస్తున్నాడు
ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సైరా' నిరాశ పరచడంతో ఈ సారి గట్టిగా కొట్టాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ‘ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దేవాదాయ భూములకు సంబంధించిన మెసేజ్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

తెలుగులో వచ్చిన సినిమాతో చిరు ప్రయోగం
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం ‘లూసిఫర్'. స్టార్ హీరో పృథ్వీరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో దీన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన రీమేక్ హక్కులను సైతం సొంతం చేసుకున్నారు. తెలుగులోనూ విడుదలైన ఈ మూవీతో ఆయన ప్రయోగం చేయబోతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

చిరంజీవి, ప్రభాస్ కాంబినేషన్‌లో మూవీ
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు రామ్ చరణ్‌తో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్‌తో చాలా చిత్రాలను నిర్మించిన అతడు... ఇప్పుడు లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడట. ఇద్దరు స్టార్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి.
Recommended Video

అందుకే ఎంటర్ అయిన యంగ్ డైరెక్టర్
లూసిఫర్ తెలుగు రీమేక్‌ను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించబోతున్నాడన్న విషయం తెలిసిందే. చిరంజీవికి అతడి పేరును సూచించింది కూడా ప్రభాసేనని అంటున్నారు. వాస్తవానికి ‘సాహో' సినిమా సమయంలోనే అతడికి మరో ఛాన్స్ ఇస్తానని ప్రభాస్ హామీ ఇచ్చాడని ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు చిరు మూవీ ద్వారా దాన్ని నిలబెట్టుకున్నాడట యంగ్ రెబెల్ స్టార్.


Click it and Unblock the Notifications











