బాలీవుడ్ సినిమా కోసం.. మరో అగ్ర హీరోను కలిసిన సాహో డైరెక్టర్.. ఏం జరుగుతోంది?

మొదటి మూవీ రన్ రాజా రన్ తోనే డిఫరెంట్ స్టైల్ లో హిట్ కొట్టిన దర్శకుడు సుజిత్ అనంతరం ఎవరు ఉహీంచని విదంగా ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం బిగ్ బడ్జెట్ తో తెరకెక్కించిన సాహో సినిమాతో సరైన హిట్ కొట్టలేకపోయాడు. దర్శకుడు సుజిత్ గత కొంత కాలంగా తన మూడవ ప్రాజెక్టును సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కోసం మరో స్టార్ హీరోను కూడా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడట.

UV తో వర్కౌట్ కాలేదు..

UV తో వర్కౌట్ కాలేదు..

రన్ రాజా రన్ సినిమా హిట్టవ్వగానే ప్రభాస్ పిలిచి మరి సాహో చేసే అవకాశం ఇచ్చాడు. సాహో సినిమా బాలీవుడ్ లో అయితే ఒక మోస్తరుగా మంచి రెస్పాన్స్ అందుకుంది. అక్కడ ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వచ్చాయి. దీంతో సుజిత్ ఆ వెంటనే యూవీ క్రియేషన్స్ లోనే మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ అది వర్కౌట్ కాలేదు.

మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చినా..

మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చినా..

సాహో తరువాత సుజిత్ కు బి టౌన్ లో చాలా ప్రొడక్షన్ నుంచి ఆఫర్స్ కూడా వచ్చయట. కానీ ఎందుకో సాహో విడుదలై ఏడాది దాటినా మరో సినిమాను తొందరగా సెట్ చేసుకోలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ కు ఆల్ మోస్ట్ డైరెక్టర్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. అయితే స్క్రిప్ట్ రెడీ చేసిన విధానంలో మెగాస్టార్ అంచనాలను అందుకోలేకపోయాడట. ఇక చివరికి న్యాయం చేయలేక సుజిత్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కూడా టాక్ వచ్చింది.

గోపిచంద్ తో అన్నారు కానీ..

గోపిచంద్ తో అన్నారు కానీ..

లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకున్న సుజిత్ మళ్ళీ కొత్త తరహా స్టోరీని రెడీ చేసుకున్నట్లు చెప్పాడు. గోపీచంద్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య రూమర్స్ బాగానే వచ్చాయి. యూవీ క్రియేషన్స్ లో ఇదివరకే గోపిచంద్ జిల్ సినిమా చేశాడు. ఆ ప్రాజెక్టు తెరకెక్కడానికి కారణం ప్రభాస్ అని అని కూడా రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అది నిజం కాదని క్లారిటీ వచ్చేసింది.

జీ స్టూడియోస్ లోనే నెక్స్ట్ సినిమా

జీ స్టూడియోస్ లోనే నెక్స్ట్ సినిమా

సుజిత్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. జీ స్టూడియోస్ సీఈఓ షరీఖ్ పటేల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ తరువాత సినిమాను సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఆ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని స్టోరీ కూడా ఆల్ మోస్ట్ సెట్టయినట్లు చెప్పారు.

సుదీప్ కూడా ఉన్నాడా?

సుదీప్ కూడా ఉన్నాడా?

యూరి సినిమాతో ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన కథానాయకుడు విక్కీ కౌషల్ తో సుజిత్ సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక అందులో మరో పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ను సంప్రధించినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పై ఇటీవల చర్చలు కూడా జరిపారట. అయితే సుదీప్ ఇంకా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో సుదీప్ ఫుల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X