Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సాహో దెబ్బకు సైరాలో భారీగా మార్పులు.. యుద్ధప్రాతిపదికన చిరంజీవి.. ఏం చేస్తున్నారంటే
సాహో మూవీ భారీగా కలెక్షన్లు సాధించినప్పటికీ.. భారీ బడ్జెట్ సినిమాలతో ఉండే ముప్పు ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలను వెంటాడుతున్నది. అత్యంత భారీ వ్యయంతో రూపొందించే నిర్మాతలు, చిత్ర యూనిట్లు కథ, కథనాల విషయంలో జాగ్రత్త పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నేల విడిచి సాము చేయవద్దనే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సైరా కూడా అందులో ఒకటనే విషయం తాజాగా బయటకు వచ్చింది. సాహో తర్వాత సైరా అవుట్‌పుట్ విషయంలో అనేక మార్పులు చేస్తున్నారనేది సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అసలే ఏం జరుగుతున్నదంటే..
సాహోపై నెగిటివ్ టాక్
సాహో సినిమాపై నెగిటివ్ రివ్యూలు, ప్రతికూలమైన టాక్ భారీగా దెబ్బ తీసింది. అలాంటి పరిస్థితి సైరాకు రావొద్దని చిత్ర యూనిట్ భారీ కసరత్తుకు తెరతీశారట. సాహో మాదిరిగా సైరా కూడా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నెగిటివ్ టాక్ రాకుండా ఉండాలనే జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు సమాచారం. ఫస్ట్ టాక్ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేయాలనే ప్లాన్ చేస్తున్నారంట.
భాషను బట్టి పాత్రల తీరు
సైరాను పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నందున ఆ భాష ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాను రూపొందించేందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారట. సినిమా ఎడిటింగ్ వర్క్‌ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఆయ భాషకు అవసరమైన మార్పులు, చేర్పులపై దృష్టిపెడుతున్నట్టు తెలిసింది.
హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో
హిందీ, ఇతర భాషల్లో చిరంజీవికి పెద్దగా క్రేజ్ ఉండే అవకాశం లేనందున్న కొన్ని మార్పులు చేస్తున్నారనేది సినీ వర్గాల సమాచారం. హిందీ వెర్షన్ సైరా విషయానికి వస్తే, అమితాబ్, తమన్నాకు ఎక్కువ భాగం, అధిక ప్రాధాన్యం ఉండేలా చూస్తున్నారట. అలాగే తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి పాత్రలకు ప్రాధాన్యం, కన్నడలో సుదీప్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు సమాచారం.
సాహో మాదిరిగా విమర్శలు రాకుండా
అలా ఎడిటింగ్ పరంగా మార్పులుపై దృష్టి పెట్టి స్థానికంగా క్రేజ్ ఉండే యాక్టర్ రోల్ నిడివిని పెంచడం జరుగుతుందని, దాంతో సైరాను ఆ భాషకు సంబంధించిన ప్రేక్షకులు తమ చిత్రంగా భావించే విధంగా డిజైన్ చేస్తున్నారట. ఈ రకం మార్పులపై సినీ వర్గాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు సమాచారం. సాహో విషయంలో హిందీ నటులు ఎక్కువ కావడం వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రేక్షకులు ఓన్ చేసుకోలేదని విమర్శకు ఇలా చెక్ పెడుతున్నారంట.
రూ.300 కోట్లతో భారీగా
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై హీరో రాంచరణ్ నిర్మాతగా రూపొందించిన సైరా సినిమా అక్టోబర్ 2న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రూ.300 కోట్లతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్‌గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.