Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాహుబలి సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ప్రభాస్.. సాహోకు కూడా అదే తరహాలో..
యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ఏ, విక్రమ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన శ్రధ్ధాకపూర్ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దీని వల్ల సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయిపోయాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు తమ విసెష్ను తెలియజేశారు. అదే సమయంలో ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో వచ్చారు.
ఇదిలాఉండగా, భారీ బడ్జెట్, హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేశారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్ టైమ్ 2.46 గంటలు అని సమాచారం. టుబాకో యాడ్‌తో కలిసి ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 50 నిమిషాలు అని తెలిసింది. గతంలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి రెండు భాగాలూ ఇదే స్థాయిలో ఉన్నాయి. నిడివి ఎక్కువైనా కంటెంట్ ఉందనే నమ్మకంతో ఇలానే రిలీజ్ చేశారు.
ఆ రెండు భాగాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టాయి. అదే సమయంలో తెలుగు సినిమాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఇప్పుడు సాహోలో సైతం అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మరి, సాహో కూడా బాహుబలిలా హిట్ అవుతుందా లేదా అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.