‘సాహో’ కొత్త రిలీజ్ డేట్ లాక్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు రెండు పండుగలు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. రెండు రోజుల నుంచి 'సాహో' వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేశారన్న వార్త ఒకటి బయటకు వచ్చింది.

‘సాహో’ వాయిదా

‘సాహో’ వాయిదా

‘సాహో' షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్బంగా ప్రభాస్ చిత్ర యూనిట్‌తో సరదాగా సెల్ఫీ దిగారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాతనే అందరూ ‘సాహో'కు గుమ్మడి కాయ కొట్టేశారని వార్తలు రాశారు. అయితే, అదే రోజు ‘సాహో' విడుదల ఆలస్యం అవుతుందన్న ప్రచారం ప్రారంభమైంది.

 అల్లు అరవింద్ వ్యాఖ్యలతో క్లారిటీ

అల్లు అరవింద్ వ్యాఖ్యలతో క్లారిటీ

ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా వాయిదా పడిందన్న వార్తలు వెలువడినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘గుణ 369' ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘‘ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి నన్ను అడిగారు. ఎప్పుడు పెట్టమంటారు అని నన్ను అడిగితే.. ఇప్పుడు ఒక పెద్ద సినిమా 15 నుంచి వెనక్కి వెళ్లింది కాబట్టి మళ్లీ ఆలోచించుకుని చెప్పండి అన్నాను. అందుకే కార్తికేయకు తెలియకుండా ఏదో డేట్ చెప్పాను. కానీ, ‘గుణ 369' సినిమా అనుకున్న రోజే రావచ్చు'' అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆ పెద్ద సినిమా ‘సాహో'నే అని క్లారిటీ వచ్చేసింది.

ఆలస్యానికి కారణాలు

ఆలస్యానికి కారణాలు

‘సాహో' ఆలస్యమైందని చెబుతున్న కొందరు.. దానికి కారణాలను సైతం వెల్లడిస్తున్నారు. గ్రాఫిక్ వర్క్ చాలా మిగిలి ఉందని, అలాగే రీ రికార్డింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాకీ ఉందని అంటున్నారు. అలాగే కొన్ని సీన్స్ విషయంలో దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడని, వాటిని రీ షూట్ చేయాలని భావిస్తున్నాడని ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

 తాజాగా కొత్త డేట్

తాజాగా కొత్త డేట్

‘సాహో'కు కొత్త డేట్ ఫిక్స్ చేశారంటూ తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దీపావళి సీజన్‌లో లాంగ్ వీకెండ్ ఉన్న కారణంగా సినిమాను అప్పుడే విడుదల చేయాలని భావిస్తోంది. అంటే అక్టోబర్ 20 తర్వాత ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సాహో గురించి

సాహో గురించి

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రమే ‘సాహో' దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ‘రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం అనుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X