For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ ఎత్తున సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక, డేట్ కన్ఫర్మ్! నిజమేనా..?

    |

    బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న 'సాహో' సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకనిర్మాతలు. టాలీవుడ్ లో గతంలో ఎన్నడూ చూడని విధంగా సర్వహంగులు జోడించి భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మేరకు అబుదాబి, ఇతర విదేశీ లొకేషన్స్‌లో ఒళ్ళు గగ్గుర్లు పొడిచే యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు.

    ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా సినిమాకు సంబందించిన అప్‌‌డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యం లోనే చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీని వేదికగా చేసుకున్నారని, ఆగస్టు 18వ తేదీన ఈ వేడుక జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ నుంచి అఫీషియల్ సమాచారం రాలేదు.

    Saaho pre release event Date & Venue Confirmed?

    యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.

    English summary
    After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully completed. As per latest news this movie pre release event is on August 18.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X