సాహో సుజిత్ ఇంకా అదే ప్రయత్నం.. ముందు బాలీవుడ్ ఆ తరువాత టాలీవుడ్..

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సుజిత్ ఆ తరువాత మెల్లగా యూవీ క్రియేషన్స్ లో రన్ రాజా రన్ అనే సినిమా చేశాడు. శర్వానంద్ హీరోగా చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కమర్షియల్ గా కాకుండా కాస్త కొత్త తరహా స్క్రీన్ ప్లే తో సుజిత్ ఆకట్టుకున్న విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ నమ్మకంతోనే ప్రభాస్ అతనికి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. బాహుబలి లాంటి సినిమా అనంతరం ఏకంగా పాన్ ఇండియా రేంజ్ ను అతని చేతుల్లో పెట్టేశాడు.

సాహో లో యాక్షన్ పై ఫోకస్ పెట్టిన సుజిత్ అనుకున్నంతగా ఎమోషన్స్ ను పండించకపోవడంతో సినిమా బెడిసి కొట్టింది. హిందీ మాస్ ఆడియెన్స్ కు తప్పితే ఆ సినిమా ఎవరిని అంతగా ఆకట్టుకోలేదు. సౌత్ ఇండస్ట్రీలో అయితే దారుణమైన నష్టాలను మిగిల్చింది. నిర్మాతలు అయితే సేఫ్ అయ్యారు గాని బయ్యర్లు మాత్రం కోలుకోలేని దెబ్బ తిన్నారు.

ఏదేమైనా సుజిత్ మాత్రం సాహో సినిమాతో కేవలం కొంతమంది ఆడియెన్స్ ను మాత్రమే సంతృప్తి పరచగలిగాడు. అగ్ర దర్శకులు సినీ ప్రముఖులు ఎవరు కూడా ఆ సినిమాపై పెద్దగా పాజిటివ్ కామెంట్స్ చేయలేదు. ఇక సాహో ప్రభావం నుంచి బయటపడేందుకు సుజిత్ బాగానే ట్రై చేశాడు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి అతనికి లూసిఫర్ ను రీమేక్ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ ఆ ఛాన్స్ ను కూడా సునీత సరిగా యూజ్ చేసుకోలేకపోయాడు. స్క్రిప్ట్ అతను డిజైన్ చేసిన విధానం మెగాస్టార్ కు అంతగా కనెక్ట్ కాకపోవడంతో అతన్ని వద్దని చెప్పి మోహన్ కృష్ణను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను సెట్ చేసిన విషయం తెలిసిందే.

Saaho sujeeth upcoming project in tollywood after bollywood movie

ఇక బాలీవుడ్ లో ఆ మధ్య కాలంలో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ కూడా వచ్చింది. ముఖ్యంగా విక్కీ కౌషల్ తో ఒక బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాను చేయబోతున్నట్లు అలాగే జీ స్టూడియోస్ లోనే ఆ సినిమాను నిర్మించనున్నట్లు కథనాలు కూడా వేలువడ్డాయి. ఆ ప్రాజెక్ట్ కోసమే సుజిత్ ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకొని తన టీమ్ తో స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యాడు. అయితే రోజులు ఎన్ని గడుస్తున్నా కూడా ఇంకా ఆ సినిమా విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు.

అయితే ఎంత ఆలస్యం అయినా కూడా ఆ ప్రాజెక్ట్ తోనే బాలీవుడ్ లో సక్సెస్ అందుకోవాలని సుజిత్ కష్టపడుతూనే ఉన్నాడట. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి. ఇక సుజిత్ యూవీ క్రియేషన్స్ లో కూడా మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ కొనసాగుతోంది. ప్రభాస్ సాహో అనంతరం సుజిత్ కు మరో అవకాశం ఇవ్వాలని యూవీ నిర్మాతలకు చెప్పాడట. అంతే కాకుండా గోపిచంద్ ను హీరోగా సెలెక్ట్ చేసుకోవాలని కూడా సూచించారని కథనాలు వేకువడ్డాయి. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X