»   » ప్రభాస్ షాకింగ్ డెసిషన్: ‘సాహో’పై ఈ ఏడాది ఆశలు వదులుకోవాల్సిందేనా?

ప్రభాస్ షాకింగ్ డెసిషన్: ‘సాహో’పై ఈ ఏడాది ఆశలు వదులుకోవాల్సిందేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి హీరో అయ్యాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చే సినిమాపై అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగిన విధంగానే రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రాన్ని తన తర్వాతి సినిమాగా ఎంచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. అయితే సాహో సినిమాకు సంబంధించిన తాజాగా ఓ షాకింగ్ విషయం ప్రచారంలోకి వచ్చింది.

 ‘సాహో' సినిమా ఈ ఏడాది రావడం లేదా?

‘సాహో' సినిమా ఈ ఏడాది రావడం లేదా?

‘సాహో' చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదంటూ... తాజాగా ఫిల్మ్ నగర్లో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి విడుదల చేయాలని ప్రభాస్, యూవి క్రియేషన్స్ వారు డిసైడ్ అయినట్లు టాక్.

ఎందుకు ఆలస్యం?

ఎందుకు ఆలస్యం?

‘సాహో' సినిమా వచ్చే ఏడాదికి వాయిదా వేయడానికి కారణం.... అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాక పోవడమేనంట. విదేశాల్లో అనుకున్న సమయానికి అనుమతులు దొరకక పోవడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోందని, దీంతో పాటు భారీగా గ్రాఫిక్స్ వర్క్ కూడా పెండింగులో ఉందని, ఇదంతా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని.....సినిమా పూర్తిగా సిద్ధమవ్వడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుందని, అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను వాయిదా వేసినట్లు టాక్.

 సాహో కంటే ముందు ప్రభాస్ నుండి మరో మూవీ?

సాహో కంటే ముందు ప్రభాస్ నుండి మరో మూవీ?

‘సాహో' ఆలస్యం నేపథ్యంలో అభిమానులు నిరాశ పడకుండా ఉండటానికి ఈ గ్యాపులో ప్రభాస్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. సాహో కంటే ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

 రాధాకృష్ణ దర్శకత్వంలో

రాధాకృష్ణ దర్శకత్వంలో

‘జిల్' చిత్ర ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ‘యూవి క్రియేషన్స్' వారే నిర్మించబోతుండటం విశేషం. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలు పెట్టి ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయబోతున్నారట.

English summary
Film Nagar bizz is that Prabhas’ “Saaho” will be postponed further. The movie’s release has been pushed to Sankranthi 2019, but there is likelihood of the film being pushed back further. As per tinsel ville, Prabhas wants to release another movie before Saaho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu