#ఆర్ఆర్ఆర్: హైదరాబాద్‌లో భారీ సెట్స్, రెండేళ్ల పాటు ల్యాండ్ లీజ్?
బాహుబలి-2 తర్వాత దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో భారీ మల్టీస్టారర్ మూవీ ప్రకటించాడు దర్శక ధీరుడు. మామూలు సినిమాగా కాకుండా ఈచిత్రాన్ని నేషనల్ లెవల్లో భారీగా తీసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి #ఆర్ఆర్ఆర్ అని పిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్‌లో భారీ సెట్స్?
బాహుబలి సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట, ఈ సెట్‌లో యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ వేయబోతున్నట్లు సమాచారం.

రెండేళ్ల పాటు షూటింగ్?
సినిమా షూటింగు కోసం నిర్మాతలు రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు రెండు సంవత్సరాలకు ల్యాండ్ లీజుకు తీసుకున్నారట. దీంతో ఈ చిత్రం షూటింగ్ సుధీర్ఘ కాలం పాటు సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.

రూ. 250 కోట్ల భారీ బడ్జెట్
బాహుబలి తర్వాత రాజమౌళి భారీ సినిమాలు తీయాలనే దానిపై దృష్టి పెట్టారని... రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రం రూ. 250 కోట్ల ఖర్చుతో భారీగా తెరకెక్కించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి
ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో, ఎన్టీఆర్... త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ కమిట్మెంట్స్ పూర్తయ్యక ఈ ఏడాది చివర్లో రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











