పవన్‌ కల్యాణ్ సంచలన నిర్ణయం: ఆ ఘోరాన్ని చూసి ఫ్యాన్స్ జీర్ణించుకోగలరా.!

By Manoj Kumar P

కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఒకటి. రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన అతడు... సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ముఖానికి మేకప్ వేసుకోబోతుండడం.. ఫ్యాన్స్‌తో పాటు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ఓకే చేసేసి ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మూడింతలు చేశాడు పవన్. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని ఓ న్యూస్ లీకైంది. దీన్ని ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

వ్యభిచారం గృహంలోని అమ్మాయిలకు అండగా...

వ్యభిచారం గృహంలోని అమ్మాయిలకు అండగా...

భారీ విజయంతో రీఎంట్రీని ఘనంగా చాటుకోవాలని భావిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్' సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్నాడు. వ్యభిచార గృహంలో చిక్కుకున్న ముగ్గురు అమ్మాయిలను కాపాడే లాయర్‌గా ఇందులో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు.

మరో ఇద్దరిని లైన్‌లో పెట్టేసిన పవన్ కల్యాణ్

మరో ఇద్దరిని లైన్‌లో పెట్టేసిన పవన్ కల్యాణ్

‘వకీల్ సాబ్' సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడక ముందే పవన్ కల్యాణ్ మరో ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఒకరు క్రిష్ జాగర్లమూడి కాగా, రెండో డైరెక్టర్ హరీశ్ శంకర్. ఇందులో మొదటి దానిని ఏఎమ్ రత్నం.. రెండో ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి షూటింగ్ ప్రారంభం కానుంది.

అది ప్రత్యేకం... పవర్ స్టార్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్

అది ప్రత్యేకం... పవర్ స్టార్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్

ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒప్పుకున్న మూడు చిత్రాల్లో క్రిష్ తెరకెక్కించేది చాలా ప్రత్యేకమైనది. దీనికి కారణం ఈ సినిమా పిరియాడిక్ జోనర్‌లో రాబోతుండడమే. అందునా పవన్ తొలిసారి ఆ తరహా సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొగల్ కాలం నాటి కథతో రూపొందే ఈ సినిమాకు ‘విరూపక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఆ డైమండ్‌ను చూపిస్తున్నారు.. నో హీరోయిన్

ఆ డైమండ్‌ను చూపిస్తున్నారు.. నో హీరోయిన్

ఈ సినిమాలో మొగల్ కాలం నాటి పరిస్థితులను చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే, కోహినూర్ డైమండ్ ప్రధానాంశంగా ఇది రూపొందుతుందని అంటున్నారు. ఇందులో పవన్ డుయల్ రోల్ చేస్తున్నాడని, అందులో ఒకటి దొంగ పాత్ర అనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

రిస్క్‌తో పాటు పవన్‌ కల్యాణ్ సంచలన నిర్ణయం

రిస్క్‌తో పాటు పవన్‌ కల్యాణ్ సంచలన నిర్ణయం

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ రిస్క్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇందులో భాగంగానే గుర్రపు స్వారీ, కత్తి సాము సహా ఎన్నో యుద్ధ విన్యాసాలు నేర్చుకుంటున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే పవర్ స్టార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
ఆ ఘోరాన్ని ఫ్యాన్స్ చూసి జీర్ణించుకోగలరా.!

ఆ ఘోరాన్ని ఫ్యాన్స్ చూసి జీర్ణించుకోగలరా.!

కథ ప్రకారం ఈ సినిమాలో హీరో పాత్ర చనిపోతుందట. అయితే, తెలుగు సినిమాల్లో అలా చాలా అరుదుగా జరుగుతుంది. కానీ, కథ డిమాండ్ మేరకు ఇందులో తన పాత్రను చంపేయడానికి పవన్ కల్యాణ్ అంగీకరించాడని తెలుస్తోంది. శాడ్ ఎండింగ్ ఉన్నప్పటికీ... క్లైమాక్స్ గూస్‌బమ్స్ వచ్చేలా తీయబోతున్నారని సమాచారం. మరి దీన్ని పీకే ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా అన్నది ప్రశ్నార్థకమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X