యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ప్రభాస్‌కు ట్రాజెడీ ఎండింగ్!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా కొనసాగుతూనే దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సీనియర్ హీరో కృష్ణంరాజు వారసుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. అతడి గురించి ఈ విషయం తెలిస్తే ఫ్యాన్స్‌కు కన్నీరు ఆగవనడంలో సందేహం లేదు. ఇంతకీ యంగ్ రెబెల్ స్టార్‌కు ఏమైంది.? వివరాల్లోకి వెళితే....

ఇక్కడ ఒకలా.. అక్కడ మరోలా.. సాహో ప్రభాస్

ఇక్కడ ఒకలా.. అక్కడ మరోలా.. సాహో ప్రభాస్


‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. అయితే, హిందీలో మాత్రం ప్రభాస్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. పాజిటివ్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపి తన స్టామినాను ఉత్తరాది వాళ్లకు చూపించాడు మన హీరో.

అప్పుడు అలా ఆపేశారు.. మళ్లీ ప్రారంభించారు

అప్పుడు అలా ఆపేశారు.. మళ్లీ ప్రారంభించారు

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. దీనికి ‘ఓ డియర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వాస్తవానికి ఈ సినిమా ‘సాహో' కంటే ముందే పూర్తవ్వాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయింది.

కొత్తగా ట్రై చేస్తున్న ప్రభాస్.. మళ్లీ అదే రేంజ్‌లో..

కొత్తగా ట్రై చేస్తున్న ప్రభాస్.. మళ్లీ అదే రేంజ్‌లో..

వరుసగా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్. అయితే, రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న మూవీలో మాత్రం బలమైన కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 1960వ దశకం నాటి ప్రేమకథతో ఈ మూవీ తెరకెక్కతోంది. ఇందులో ప్రభాస్ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

ప్రభాస్‌కే ఇలా జరుగుతోంది.. అందుకే ఆలస్యం

ప్రభాస్‌కే ఇలా జరుగుతోంది.. అందుకే ఆలస్యం

ఈ సినిమా ప్రారంభించిన వెంటనే ఆగిపోయిన విషయం తెలిసిందే. రెండోసారి షూటింగ్ మొదలైన తర్వాత కూడా పలుమార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. దీనికితోడు ప్రభాస్ విశ్రాంతి పేరుతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడేమో కరోనా కారణంగా షూటింగ్ మరింత ఆలస్యం అవుతోంది.

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతోన్నాయి. ఈ సినిమా కథ, ఇందులో ప్రభాస్ చేస్తున్న పాత్ర, హీరోయిన్ రోల్, సెట్స్ ఇలా ఎన్నో వాటికి సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. ఇందులో ఫ్యాన్స్ జీర్ణించుకోలేని ఓ సంఘటన జరుగుతుందనేదే దాని సారాంశం.

Recommended Video

Prabhas Rejected 10 Super Hit Movies In His 17 Years Career In Film Industry
అప్పటిలానే.. ఈ విషయం తెలిస్తే కన్నీరు ఆగవు.!

అప్పటిలానే.. ఈ విషయం తెలిస్తే కన్నీరు ఆగవు.!


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభాస్ సినిమాలో క్లైమాక్స్ విషాదాంతం అవుతుందట. గతంలో కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చక్రం' సినిమాలోలా.. ఇందులోనూ యంగ్ రెబెల్ స్టార్ ట్రాజెడి ఎండింగ్ ఉంటుందనే ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అప్పుడు ఈ కారణంగానే సినిమా ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు రిజల్ట్ మారుతుందా.? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X