Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దొంగచాటుగా అలా చేయడం నాకు నచ్చదు...!?
తేజ దర్శకత్వంలో, నితిన్ హీరోగా నటించిన తొలి చిత్రం 'జయం"లో హీరోయిన్ గా నటించిన సదా ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించినా పెద్దగా రాణించలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో, విక్రమ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'అపరిచితుడు" చిత్రంలో సదా హీరోయిన్ గా నటించినా ఆమెకు ఎందుకనో సరైన గుర్తింపురాలేదు. ఎవరు పుట్టించారో కానీ సదా వివాహం త్వరలో జరుగనుందని ఒక పుకారు మీడియాలో ఈ మధ్య రాజ్యమేలుతోంది. అందుకనే సదా కొత్త చిత్రాలేవీ అంగీకరించటం లేదనీ కూడా వినికిడి. దీనికి సదా స్పందిస్తూ పెళ్ళా..?నాకా...? ఇప్పట్లో నాకు వివాహం చేసుకునే ఆలోచన లేదనీ అంటోంది.
ఇటీవల ఓ సందర్భంలో అందాల ముద్దుగుమ్మ సదా మాట్లాడుతూ... 'ఈ మధ్య నేను పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు బాగా వస్తున్నాయి. సినిమా తగ్గాయి కదా అని నేను పెళ్ళి చేసుకుని సెటిల్ అవుతానని చాలా మంది అనుకుంటున్నారు. తెలుగు సినిమాల్లో చేయడంలేదుగానీ... కన్నడంలో నటిస్తూ ఫుల్ బిజీగానే ఉన్నాను. అలాంటప్పుడు పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాల్సిన అవసరం నాకేంటి? పెళ్ళి చేసుకోవడమనేది మన చేతుల్లో లేదు. అది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ నేను పెళ్ళి చేసుకుంటే కనుక దొంగచాటుగా చేసుకోను. అందరికీ చెప్పే చేసుకుంటా" అని అంటోంది.