అవన్నీ అవాస్తవాలే.. పవన్ కళ్యాణ్ సినిమాపై యంగ్ డైరెక్టర్ క్లారిటీ
పవన్ కళ్యాణ్ వరుసబెట్టి సినిమాలను ప్రకటిస్తున్నాడు. ఎప్పుడు ఏది ఎలా మొదలవుతుంది.. ఏది పూర్తవుతుందో ఓ లెక్కాపత్రం లేకుండా పోయింది. అసలే ఇంతకు ముందున్న కమిట్మెంట్లే పూర్తి కాలేదు. మళ్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్‌లో ఓ చిత్రానికి ఓకే చెప్పాడు. మరో వైపు బండ్ల గణేష్‌కు కూడా మాటిచ్చి ఉన్నాడు. మొదట అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

వరుసగా..
వకీల్ సాబ్ పూర్తయ్యాక క్రిష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలి. ఆ తరువాత మైత్రీ వారి హరీష్ శంకర్ మూవీ లైన్‌లో ఉంది. ఇవి రెండు పూర్తయ్యాకే మిగతా సినిమాలు చేయాలి. కానీ ఇందులోనే భారీ మార్పులు వచ్చినట్టు తెలుస్తున్నాయి. వకీల్ సాబ్ అయ్యాక నేరుగా సితార ఎంటర్టైన్మెంట్స్‌పై తెరకెక్కించే చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్.

వార్తలు వైరల్..
మలయాళీ చిత్రమైన అయ్యప్పనుమ్ కోషియుమ్ అక్కడ విమర్శకులు ప్రశసంలు అందుకుంది. మిలటరీ ఆఫీసర్, పోలీసాఫీసర్‌ల మధ్య జరిగే కథ అక్కడి ప్రేక్షకులను బాగానే కట్టిపడేసింది. మిలటీరీ ఆఫీసర్ పాత్రలో పృథ్వీ రాజ్ నటించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బిజూ మీనన్ అద్భుతంగా నటించాడు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంచుకున్న పాత్రకు ప్రాధాన్యతను పెంచి మిగతా క్యారెక్టర్‌ను తగ్గించనున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

స్పందించిన డైరెక్టర్..
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో రెండు బలమైన పాత్రలుంటాయన్నాడు. రెండూ మంచి పాత్రలేనని, వాటిలో ఉన్న ఫీల్, సోల్ చెడిపోకుండా.. మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశామని సాగర్ చంద్ర ప్రకటించాడు. అంతేతప్ప, ఏ పాత్ర ఔచిత్యాన్ని తగ్గించడం లేదంటున్నాడు.

అభిమానిగా..
పవన్ కళ్యాణ్‌ను ఓ అభిమానిగా తాను ఎలా చూడాలనుకుంటున్నాడో ఓ ఆలోచన ఉందని.. దానికి తగ్గట్టే ఈ రీమేక్‌లో కొన్ని చొప్పిస్తానని చెప్పుకొచ్చాడు. తాను చేసిన మార్పులు పవన్ కల్యాణ్‌కు నచ్చాయని, ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతాయని నమ్మకంగా చెప్పుకొచ్చాడు. అసలే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర అని దసరా రోజు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











