రానా, రవితేజ మల్టీస్టారర్.. యువ దర్శకుడికి రీమేక్ ఆఫర్!

ఒక్క సినిమా ఎన్నెన్నో మలుపులు తిరుగుతోంది. మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనమ్ కోషియం' తెలుగు రీమేక్‌పై రోజుకో వార్త వైరల్ అవుతోంది. మొదటగా హీరోల విషయంలో రోజుకో వార్త రాగా.. ప్రస్తుతం దర్శకుల విషయంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అంతలా ఆ సినిమా టాలీవుడ్‌పై ప్రభావం చూపించింది. అది తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రయోగమే అయినా రీమేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

మొదటగా ఈ చిత్రాన్ని తెలుగులో బాలయ్య, రానా ప్రధాన పాత్రల్లో నిర్మించాలని భావించారు. అయితే ఏవో కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాలో నటించడంపై ఆసక్తి చూపించలేదట. దీంతో బాలయ్య పాత్రలో రవితేజను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తునట్లు తాజా సమాచారం. అయితే ఇప్పటికీ హీరోల విషయం ఎవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు.

Sagar Chandra To Direct Ayyappanum Koshiyum Telugu Remake

తాజాగా దర్శకుల లిస్ట్ కూడా పెరిగిపోతోంది. ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ దర్శకుడి విషయంలో తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది.

ఇంత వరకు సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం అందగా.. తాజాగా ఆ స్థానంలోకి అప్పట్లో ఒకడుండేవాడు, అయ్యారే లాంటి చిత్రాల్ని తెరకెక్కించిన సాగర్ చంద్ర పేరు వచ్చింది. అయితే సున్నితమైన అంశాల్ని తెరకెక్కించడంలో సాగర్ చంద్ర మార్క్ గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ వార్త అయినా నిజమో కాదో చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X