సాహో దెబ్బతో ప్రభాస్ రియలైజ్.. అందుకే షాకింగ్ నిర్ణయం..

By Manoj

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి మన దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. అదే సమయంలో ప్రఖ్యాతి మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అతడికి మరింత హైప్ వచ్చింది. ఇక, ఇటీవల వచ్చిన 'సాహో'తో మరోసారి ప్రభాస్ చర్చనీయాంశం అయిపోయాడు. ఈ సినిమా ఊహించినంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ప్రభాస్ తర్వాతి సినిమాపై దృష్టి సారించాడు. ఇందులో భాగంగానే త్వరలోనే తన తదుపరి చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.

 భారీ అంచనాలతో వచ్చాడు

భారీ అంచనాలతో వచ్చాడు

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల అయింది.

 జాన్ అంటూ వస్తున్నాడు

జాన్ అంటూ వస్తున్నాడు

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 18న నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో జరగనుంది. జాన్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2020 చివ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనుంది.

 అప్పటి లవ్ స్టోరీని చూపిస్తారట

అప్పటి లవ్ స్టోరీని చూపిస్తారట

‘జాన్' సినిమా పాత కాలపు ప్రేమ కథగా తెరకెక్కనుంది. గతంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూలలో ప్రభాస్ దీనిపై స్పందించాడు కూడా. విదేశాలలో నడిచే 1965 కాలం నాటి లవ్ స్టోరీనే ‘జాన్' అని సాహో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో ప్రభాస్ స్వయంగా చెప్పాడు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అందరిలో ఆసక్తి నెలకొంది.

 కొంత భాగం అయిపోయింది

కొంత భాగం అయిపోయింది

‘జాన్' సినిమా విదేశీ ప్రేమ కథ కావడంతో అప్పట్లో యూరప్‌లో కొంత భాగం షూటింగ్ కూడా జరిపారు. ఆ తర్వాత ‘సాహో' సినిమా ఉండడంతో దీని షూటింగ్ ఆపేశారు. దీని వెనుక చాలా కారణాలు ప్రచారం అయ్యాయి. ఓవర్ బడ్జెట్ అవుతుందని కొందరు అంటే.. కాదు కాదు స్క్రిప్టులో మార్పులు చేయడం వల్లే సినిమా ఆగిందని కొందరు అన్నారు.

 ఆ ప్రభావంతో బయటకు వెళ్లరట

ఆ ప్రభావంతో బయటకు వెళ్లరట

‘సాహో' సినిమా ప్రభావం ప్రభాస్‌పై బాగానే పడినట్లు అనిపిస్తోంది. తాజాగా బయటికొచ్చిన ఓ వార్త దీనికి బలం చేకూరుస్తోంది. ‘జాన్' షూటింగ్ కోసం యూరప్ వెళ్లాల్సి ఉన్నా ప్రభాస్ మాత్రం వద్దని అంటున్నాడట. అక్కడి వెళ్తే భారీ బడ్జెట్ అయిపోతుంది. ఇక్కడే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి మేనేజ్ చేద్దాం అని నిర్మాతలతో అన్నాడట యంగ్ రెబెల్ స్టార్. దీంతో చిత్ర యూనిట్ దీనికి ఓకే చెప్పేసిందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X