యంగ్ హీరోయిన్ బుగ్గ గిల్లి చెప్పిన మెగా మేనల్లుడు.. బాలయ్యతో పోటీ తప్పదా..?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఏకంగా బాలకృష్ణతో పోటీకి దిగుతున్నాడనే సమాచారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రాశీ ఖన్నా బుగ్గ గట్టిగా గిల్లుతూ సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా విడుదల తాలూకు అప్‌డేట్ ఇవ్వడం.. అదే రోజు నందమూరి బాలకృష్ణ కూడా రెడీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు చూస్తే..

రాశీ ఖన్నాతో ప్రతీ రోజూ పండగే..
సాయి ధరమ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై 'ప్రతీ రోజు పండుగే' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవి పరిశీలించి ఓకే చేసిన కారణంగా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

శరవేగంగా షూటింగ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకొని 'ప్రతీ రోజూ పండగే' షూట్ చేస్తున్నారు డైరెక్టర్ మారుతి. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అమెరికా పయనమైంది. అక్కడి అందమైన లొకేషన్స్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. కాగా తాజాగా చిత్ర విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
హీరోయిన్ బుగ్గ గిల్లి చెప్పిన మెగా మేనల్లుడు
ఈ పోస్టర్‌లో హీరోయిన్ రాశీ ఖన్నా బుగ్గ గట్టిగా గిల్లుతూ కనిపించాడు మెగా మేనల్లుడు. ఈ మేరకు డిసెంబర్ 20వ తేదీన 'ప్రతీ రోజూ పండగే' సినిమా విడుదల కానుందని తెలిపాడు. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ కి వచ్చిన ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందని తెలుపుతూ ట్వీట్ చేశాడు.

బాలయ్యతో ఢీ..
మరోవైపు అదే రోజు నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రూలర్' సినిమా కూడా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించనప్పటికీ డిసెంబర్ 20న రిలీజ్ కన్ఫర్మ్ అని సమాచారం. సో.. నందమూరి వారసుడు బాలకృష్ణతో మెగా మేనల్లుడి క్లాష్ తప్పదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











