మెగా హీరోను అభిమానులు పట్టించుకోవడం లేదా?

By Bojja Kumar

చిరంజీవి కుటుంబం నుంచి వెండి తెరకు పరిచయం కావడానికి సిద్దంగా ఉన్న హీరో సాయి ధరమ్ తేజ. చిరంజీవి మేనల్లుడయిన సాయి ధరమ్ తేజ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 'రేయ్" సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. సాధారణంగా మెగా కుటుంబం నుంచి వచ్చే ఏ హీరోపై అయినా అభిమానులు చాలా ఆసక్తి, అభిమానం చూపుతుంటారు. వారితో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి, ఆటో గ్రాఫ్ తీసుకోవడానికి ఎగబడుతూ ఉంటారు. అయితే సాయి ధరమ్ తేజ విషయంలో మాత్రం ఆ హైప్ కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పంజా ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యాడు సాయిధరమ్ తేజ. అయితే మెగా అభిమానులు ఆయన ఎవరో తెలియనట్లే ప్రవర్తించారు.

సాయి ధరమ్ తేజ ఈ మధ్య ఎక్కడా ఎక్స్ ఫోజ్ కావడం లేదు. అందువల్లనే మెగా అభిమానులు ఆయన్ను గుర్తు పట్టలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు రేయ్ సినిమా విడుదలపై కూడా అభిమానులు ఆసక్తి చూపక పోతే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. అటు చిరంజీవి కూడా మేనల్లుడిని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేయ్ సినిమా విడుదలై ఆ సినిమా విజయవంతం అయ్యే రేంజ్లో కథ, కథనం పవర్ ఫుల్ గా ఉంటే తప్ప సాయి ధరమ్ తేజకు సినిమా లైఫ్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి ఏం జరుగబోతోందో? రేయ్ సినిమా విడుదలైతే గానీ తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X