అందరూ ఆమెనే ఓకే చేశారు.. మెగా మేనల్లుడి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి సరైన జోడీ హీరోయిన్ రాశీ ఖన్నా మాత్రమే అంటున్నారట అంతా. ఈ మేరకు ఆయన తాజా సినిమాలో మరోసారి ఆమెనే కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరూ అలరించబోయే ఆ సినిమా విశేషాలేంటో చూద్దామా..
ఆరు వరుస ఫ్లాప్స్ తర్వాత 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ బాటలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇటీవలే 'ప్రతీ రోజు పండగే' సినిమాతో సూపర్ హిట్ సాధించాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ జోడీగా రాశీ ఖన్నా నటించి క్రేజ్ కొట్టేసింది. గతంలో కూడా ఈ ఇద్దరూ కలిసి సుప్రీమ్ సినిమాలో రొమాన్స్ పండించి ఆకట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ఫ్రెష్ మూవీలో రాశీ ఖన్నాకు అవకాశం ఇచ్చి ఆ జోడీ క్రెడిట్‌ని తమ సినిమాకు పాజిటివ్‌గా మార్చుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. ఓ వైపు 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ చేతులమీదుగా లాంచ్ చేయబడిన ఈ మూవీలో నివేద పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే కథ ఆధారంగా ఇందులో మరో హీరోయిన్‌కి ఛాన్స్ ఉండటంతో దర్శకనిర్మాతల చూపు రాశీ ఖన్నాపై పడిందట. సాయి తేజ్ సూపర్ హిట్ జోడీ కాబట్టి ఆమెనే కావాలని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం.. ఈ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా ఉంటుందని ఇలా డిసైడ్ అయ్యారట. ఈ ఇద్దరితో అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











