ఓటీటీ లాభాలే బెటర్.. మెగా హీరోతో పాటు మిస్ ఇండియా కూడా డిజిటల్ వరల్డ్‌లోనే..
కరోనా వైరస్ ధాటికి కొందరు సినిమా నిర్మాతలు చాలా వరకు నష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. ఇప్పట్లో థియేటర్స్ తెరిచే అవకాశం లేదని షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో విడుదల కాబోతున్నాయి. ఒక వేళ థియేటర్స్ ఓపెన్ అయినా కూడా జనాలు భారీ స్థాయిలో వచ్చే అవకాశం లేదు. అందుకే రిస్క్ చేయడం ఇష్టం లేక ఎంతో కొంత నష్టాల నుంచి బయటపడాలని డీలింగ్స్ సెట్ చేసుకుంటున్నారు.
అయితే కొన్ని ఓటీటీ సంస్థలు మరి తక్కువకాకుండా సినిమా బడ్జెట్ కి తగ్గట్టుగానే ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ + సాటిలైట్ ద్వారా పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చేసే అవకాశం ఉండడంతో కొందరు నిర్మాతలు వచ్చిందే లాభం అనుకోని డీల్ సెట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను కూడా అదే తరహాలో జీ ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

త్వరలోనే మెగా హీరో సినిమా ZEE5 లో టెలిక్యాస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు మహానటి కీర్తి సురేష్ సినిమా కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనే రిలీజ్ కానున్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే పెంగ్విన్ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన కీర్తి ఇప్పుడు మిస్ ఇండియా సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు డిజిటల్ వరల్డ్ లో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటాయో చూడాలి. మరోవైపు నాని V సినిమా కూడా ఓటీటీలోనే విడుదల కానున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











