For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’లో మెగా హీరో: తొలిసారి స్టార్‌తో మూవీ.. అదిరిపోయే ప్లాన్ వేసిన డైరెక్టర్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో రకమైన శైలి ఉంటుంది. అలా కెరీర్ ఆరంభం నుంచీ అదే తరహా చిత్రాలను రూపొందిస్తూ ఉంటారు. అయితే, కొందరు మాత్రమే వైవిధ్యమైన చిత్రాలతో విలక్షణ దర్శకులుగా పేరు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకడు. మొదటి చిత్రంతోనే తనలోని ప్రత్యేకతను చాటి చెప్పిన అతడు.. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'హనుమాన్' అనే మరో సరికొత్త ప్రయోగాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాలో మెగా హీరో నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

  మొదటి నుంచీ అదే తరహా చిత్రాలు

  మొదటి నుంచీ అదే తరహా చిత్రాలు

  టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘అ!' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా.. అతడికి ఎంతో పేరును తెచ్చింది. అంతేకాదు, దీనికి పలు విభాగాల్లో జాతీయ అవార్డు సైతం దక్కింది. దీని తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌తో ‘కల్కీ' అనే మరో ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించాడతను.

  ‘జాంబీ రెడ్డి'తో భారీ హిట్ కొట్టేశాడు

  ‘జాంబీ రెడ్డి'తో భారీ హిట్ కొట్టేశాడు

  ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి'. తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లను కూడా ఊహించని స్థాయిలో అందుకుని నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ప్రయోగాత్మకంగా వచ్చిన దీన్ని యాపిల్ ట్రీ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతం అందించారు.

  హనుమాన్ అంటూ వస్తోన్న డైరెక్టర్

  హనుమాన్ అంటూ వస్తోన్న డైరెక్టర్

  ఇప్పటికే పలు వైవిధ్యమైన సినిమాలను రూపొందించిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ‘హనుమాన్' అనే సినిమాతో రాబోతున్నాడు. శనివారమే దీనిపై ప్రకటన చేసిన అతడు.. ‘ఈ సారి నాకు ఇష్టమైన జోనర్‌తో వస్తున్నాను. క్రొత్త సినిమాటిక్ విశ్వంలోకి ప్రవేశించడానికి మీ సీట్ బెల్టులను కట్టుకోండి. హనుమాన్.. తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా' అంటూ ట్వీట్ చేశాడు.

  హీరోను ప్రకటించకపోవడంతో అలా

  హీరోను ప్రకటించకపోవడంతో అలా

  ఈ సినిమా ప్రకటన కోసం ఓ వీడియోను సైతం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో హిమాలయ పర్వతాలను చూపిస్తూ చేసిన పిక్చరైజేషన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క వీడియోతోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు ప్రశాంత్ వర్మ. ఇక, ఇందులో హీరోగా ఎవరు నటించబోతున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి.

   ‘హనుమాన్' మూవీలో మెగా హీరో

  ‘హనుమాన్' మూవీలో మెగా హీరో

  వాస్తవానికి ‘హనుమాన్' మూవీని అనౌన్స్ చేసిన తర్వాత హీరోలతో సంప్రదింపులు జరపాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు ఇప్పటికే చెప్పాడు. అందుకు అనుగుణంగానే ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లతో సినిమా చేస్తానని కూడా చెప్పాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  అదిరిపోయే ప్లాన్ వేసిన దర్శకుడు

  అదిరిపోయే ప్లాన్ వేసిన దర్శకుడు

  ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ‘హనుమాన్'ను చిన్న హీరోతో చేస్తే.. కేవలం తెలుగులోనే రూపొందించాలని ప్రశాంత్ వర్మ భావించాడట. పెద్ద హీరో అయితే పలు భాషల్లో తీస్తాడట. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌తో దీన్ని రూపొందించబోతున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లోనే తీయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

  P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Filmibeat Telugu
  దాని తర్వాత ఈ సినిమాకు సిగ్నల్

  దాని తర్వాత ఈ సినిమాకు సిగ్నల్

  సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవ కట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. లాక్‌డౌన్ తర్వాత కొద్ది రోజుల పాటు తన పార్ట్‌ షూట్‌లో పాల్గొని.. ఆ తర్వాత ‘హనుమాన్' కోసం అతడు సిద్ధం కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే.. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మెగా హీరో యాక్టింగ్ ప్లస్ అవుతుందనే చెప్పాలి.

  English summary
  Talented director Prasanth Varma New Movie with Original Superhero Story Title is HANU-MAN. In This Movie Mega Hero Sai Dharam Tej to play Lead Role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X