twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా మేనల్లుడి సామాజిక కోణం.. సక్సెస్ అయ్యేనా..?

    |

    వరుస పరాజయాలతో సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే 'చిత్రలహరి' సినిమాతో కాస్త రిలాక్స్ అయ్యాడు. ఈ సినిమా ఆశించిన మేర కాకపోయినా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో ఉపిరి పీల్చుకున్నాడు. ఇక నుంచైనా సరైన కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకోవాలని భావించిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మెగాస్టార్ చిరంజీవి పరిశీలించి ఓకే చేయడం విశేషం.

    అయితే మారుతి సినిమాతో పాటు తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు సాయిధరమ్ తేజ్. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నాడని తెలిసింది. దర్శకుడు దేవాకట్టా సామాజిక కోణంలో రెడీ చేసుకున్న స్క్రిప్ట్ చూసి సాయి ధరమ్ తేజ్ వెంటనే ఓకే చెప్పేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సోషల్ మెస్సేజ్ ఇవ్వాలని సాయి ధరమ్ తేజ్ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. టైటిల్ అనౌన్స్ చేశాకే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

    Sai Dharam Tej New Movie With Deva Katta

    అయితే సామజిక కోణంలోని కథాంశం మెగా మేనల్లుడికి నప్పుతుందా? లేదా? అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. డైరెక్టర్ దేవా కట్టా గతంలో ప్రస్థానం సినిమా ద్వారా తన టాలెంట్ బయటపెట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ చిత్రాలు ఆయనకు నిరాశే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో ఇటు సాయిధరమ్ తేజ్, అటు దేవా కట్టా ఇద్దరికీ ఈ సినిమా ఎంతో కీలకం. కాబట్టి ప్రస్థానం లాంటి పవర్ ఫుల్ స్క్రీన్ ప్లేతో సామాజిక అంశాల్ని ప్రేక్షకుల గుండెల్లో జొప్పిస్తేనే మంచి విజయం సాధించడం సాధ్యపడుతుంది. చూడాలి మరి ఇలాంటి కథాంశం ఈ ఇద్దరికీ ఎలా కలిసొచ్చేనా అనేది.

    English summary
    Mega Hero Sai Dharam Tej commits with his new movie on Deva Katta direction. As par latest talk in this movie they can give social messege to the audians
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X