మరో మాస్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ
కరోనా కష్ట కాలంలో కూడా రిస్క్ చేసి మరి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన మొదటి పెద్ద సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ అనుకున్నంత పాజిటివ్ టాక్ ను అందుకోలేదు కానీ స్లోగా 50% ఆక్యుపెన్సీ లోనే పరవాలేదు అనే విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఒకవిదంగా సాయి సినిమాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కూడా బాగానే అందింది.
అయితే నెక్స్ట్ సినిమాతో అంతకు మించి అనేలా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత సుకుమార్ రైటింగ్స్ లో మరో సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బోయపాటి శ్రీనివాస్ ప్రస్తుతం బాలకృష్ణతో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత కూడా వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని లాక్ డౌన్ లోనే ఒక బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు దర్శకుడు బోయపాటి. ఇక సాయి ధరమ్ తేజ్ కు కథ కరెక్ట్ గా సెట్టవుతుందని ఇటీవల సంప్రదింపులు జారిపినట్లు సమాచారం. ఆల్ మోస్ట్ సాయి కూడా ఒకే చేసినట్లు తెలుస్తోంది. కానీ ముందుగా చేతిలో ఉన్న రెండు సినిమాలను ఫినిష్ చేస్తే గాని డేట్స్ దొరకవట. మరి బోయపాటి BB3 అనంతరం కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని సాయి కోసం వేయిట్ చేస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











