సాయి ధరమ్ తేజ్ పండుగ చేసేది ఆరోజేనట.. కొత్త అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఖుషీ

హీరోకు ఉండాల్సిన టాలెంట్ ఉన్నా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తన గత చిత్రం 'చిత్రలహరి' పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది.

వరుస ఫ్లాపులు రావడంతో కథల ఎంపికపై జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్న ఈ మెగా హీరో.. ప్రేక్షకుల మన్ననలు పొందే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. తేజూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.

 Sai Dharam Tej News Movie Prathi Roju Pandage Release Date Fix

తాజాగా ఈ సినిమా రిలీజ్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ప్రతిరోజూ పండగే' సినిమాను డిసెంబర్ 20 విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

ఇదిలాఉండగా, ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో నిర్మించిన ఇంటి సెట్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ వాడకుండా అతి కొద్ది రోజుల్లో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ నిర్మించిన ఆ ఇంటిని సిమెంటు ఎక్కడా వాడకుండా కేవలం 17 రోజుల్లోనే 1.25 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. దీంతో ఇది కాస్తా హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X