‘ప్రస్థానం’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా.. పవర్‌ఫుల్ రోల్‌లో కనపడనున్న యంగ్ హీరో

హీరోకు ఉండాల్సిన టాలెంట్ ఉన్నా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తన గత చిత్రం 'చిత్రలహరి' పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది.

వరుస ఫ్లాపులు రావడంతో కథల ఎంపికపై జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్న ఈ మెగా హీరో.. ప్రేక్షకుల మన్ననలు పొందే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నాడు. ఇందుకోసం కమర్షియల్ పంథాను పక్కన పెట్టేసి సరికొత్త ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇందులో భాగంగానే 'ప్రస్తానం' దర్శకుడు దేవకట్టాతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.

Sai Dharam Tej News Movie With Prasthanam Fame Deva Katta

'వెన్నెల' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన దేవకట్టా 'ప్రస్థానం' ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమను తన వైపునకు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అదే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది.

ఈ సినిమా తర్వాత దేవకట్టా సాయి ధరమ్ తేజ్‌తో సినిమా చేయడానికి ఓ కథను వినిపించాడని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో సాయి క్యారెక్టర్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఈ చిత్రాన్ని భగవాన్, పుల్లారావు నిర్మిస్తారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. తేజూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X