మెగా మేనల్లుడి చేతిలో వరల్డ్ ఫేమస్ లవర్.. ఆ తరువాతే ఇలా!

సినిమా అవకాశం అనేది ఎప్పుడు, ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని సందర్భాల్లో చేతి దాకా వచ్చిన ప్రాజెక్టు చేజారిపోవడం, ఆ తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం చాలా మంది స్టార్ హీరోలకు అనుభవమే. అయితే కొన్ని సందర్భాల్లో విడుదలకు ముందు వస్తున్న రెస్పాన్స్ కూడా ఆ సినిమా వదులుకున్న వారికి కాసింత ఇబ్బందికరంగానే అనిపిస్తుంటుంది.

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

Sai Dharam Tej Rejects World Famous Lover

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా కోసం విజయ్ దేవరకొండ కంటే ముందుగా సాయి ధరమ్‌ తేజ్‌‌ను సంప్రదించాడట క్రాంతిమాధవ్. ఆయన కాదనడంతో శర్వానంద్‌ని కూడా అడిగాడట. కానీ ఆ హీరో కూడా ఈ కథను రిజెక్ట్ చేయడంతో చివరకు విజయ్‌ దేవరకొండ దగ్గరకు ఈ కథ వెళ్లిందట.

ఎలా క్రాంతిమాధవ్ తీసుకొచ్చిన ఈ కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయించి విజయ్‌ దేవరకొండ ఓకే చెప్పారట. మొత్తానికి టీజర్ ద్వారా 'వరల్డ్ ఫేమస్ లవర్' కథ విజయ్‌ దేవరకొండకు బాగా యాప్ట్ అయిందని స్పష్టమయింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు కొడుకు కేయస్ వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్యా రాజేష్‌, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X