twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా మేనల్లుడుతో న్యూ హీరోయిన్ రొమాన్స్.. చిరంజీవి ఓకే అనడంతో ఊపిరి పీల్చుకున్నారు

    |

    మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస పరాజయాలతో సతమతమౌతున్నారు. సరిగ్గా కెరీర్ గాడిలో పడుతుందన్న సమయంలో ఆయనను ప్లాప్స్ వెంటాడుతున్నాయి. వీవీ వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్ చేతిలో పడినా తేజు దశ మారలేదు. దీంతో అల్లుడి కోసం మామ చిరంజీవి రంగంలోకి దిగారట. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా స్క్రిప్ట్ ముందు చిరంజీవి విని దానిని ఓకే చేయడంతో ఆ సినిమాకు కమిటయ్యారట సాయి ధరమ్ తేజ్.

    ఇటీవలే సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'చిత్రలహరి' ఫరవాలేదనిపించింది. అయితే ఈ సినిమా కంటే ముందు వరుస పెట్టి అరడజను ప్లాప్స్ సాయి ధరమ్ తేజ్ ఖాతాలో పడి ఆయన వెన్నువిరిచాయి. ఈ నేపథ్యంలో సరైన గైడెన్స్ లేకపోవడం వల్లనే తేజును వరుస పరాజయాలు వెంటాడుతున్నాయనే టాక్ వచ్చింది. దీంతో ఇకనైనా తదుపరి ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని గ్రహించిన సాయిధరమ్ తేజ్ సినిమా ఎంపిక విషయంలో మామ చిరంజీవి సాయం కోరారట. దానికి చిరు కూడా పాజిటివ్ గానే స్పందించి డైరెక్టర్ మారుతి చెప్పిన కథ విని ఓకే చెప్పేశారని సమాచారం.

    Sai Dharam Tejs new movie confirmed with Maruthi

    సాయి ధరమ్ తేజ్ కోసం మారుతి ఒక కథను సిద్ధం చేసి, చిరంజీవి, అల్లు అరవింద్ లకు వినిపించాడట. కథ నచ్చడంతో ఈ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్లపై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ ను, హీరోయిన్ గా నేల టిక్కెట్టు భామ మాళవిక శర్మను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

    రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మాళవిక శర్మ.. ఆ తరువాత సరైన అవకాశాలు పట్టలేక పోయింది. తొలి సినిమా డిజాస్టర్‌ కావటంతో సోషల్‌ మీడియాను నమ్ముకొని అందాల విందు చేసింది. మొత్తానికి ఎలాగోలా మెగా మేనల్లుడుతో సరసాలాడే ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమానైనా అటు మాళవిక శర్మకు, ఇటు సాయి ధరమ్ తేజ్‌కు సరైన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

    English summary
    Supreme hero Sai Dharam Tej upcoming movie with director maruthi. In this movie the heroine Malavika Sharma confirmed to romance with tej.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X