మెగా మేనల్లుడి భోగి.. ఇంతకీ లక్కు కలిసొచ్చేనా..?

వరుస పరాజయాలతో సతమతమౌతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. సరిగ్గా కెరీర్ గాడిలో పడుతుందన్న సమయంలో ప్లాప్స్ వెంటాడుతుండటం మెగా అభిమానులను నిరాశ పరుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే కరుణాకరణ్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ చేసిన చిత్రలహరి సినిమా కాస్త ఊరటనిచ్చింది. పేరులోని ధరమ్ ని తొలగించి సాయి తేజ్ గా మారాక లక్ కలిసొచ్చింది. దీంతో ఇదే ఛాన్స్.. ఇక గాడిలో పడాల్సిందే అని భావించిన సాయి ధరమ్.. డైరెక్టర్ మారుతితో తన కొత్త సినిమాను కమిట్ అయ్యాడు.

చిత్రలహరి ఇచ్చిన ఉత్సాహంతో సాయి ధరమ్ తేజ్ మారుతీ సెట్స్ పై కాలు పెట్టనున్నాడు. ఈ క్రేజీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2- యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి భోగి అనే ఆసక్తికర టైటిల్‌ని ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. చిత్ర షూటింగ్ ఈనెల 9న మొదలవుతుందని అంటున్నారు. ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని, ఖచ్చితంగా ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుందని చెప్పుకుంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇక ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నేల టికెట్టు బ్యూటీ మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండటం ఆసక్తికర అంశం.

Sai Dharam Tejs new movie with Maruthi title as Bhogi

అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మారుతి స్క్రిప్ట్ చూసి ఈ కథను తన మేనల్లుడి కోసం ఓకే చేశారు. తాను తయారు చేసుకున్న స్క్రిప్ట్ లో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీకి కావాల్సిన అన్ని అంశాలు జోడించి సాయి ధరమ్ తేజ్ కెరీర్‌ని యూ టర్న్ చేసే భాద్యతను భుజాలపై వేసుకున్నారట డైరెక్టర్ మారుతి. చూడాలి మరి ఇంత సాఫ్ట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మెగా మేనల్లుడికి ఏ మేర ప్లస్ అవుతుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X