Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
మేనల్లుడి కోసం పవన్ సెట్ చేసిన స్టోరీలు.. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో?
మెగా ఫ్యామిలీలో ఒక హీరోతో హిట్టు కొడితే చాలు మిగతా హీరోలు దాదాపు తలుపులు తెరిచినట్లే. యవరేజ్ హిట్ అందుకున్న కూడా ఇప్పటి దర్శకులకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. పనితనం నచ్చితే హీరోలు ఫెయిల్యూర్ లో ఉన్న దర్శకులను కూడా వదలడం లేదు. నిజానికి కథల కొరత గట్టిగానే ఏర్పడినట్లు ఇప్పటి రొటీన్ సినిమాలను చూస్తే ఈజీగా అర్దమవుతోంది. అయితే కొంతమంది హీరోలు వారి బాడి లాంగ్వేజ్ కి తగ్గట్లుగా వారే సొంతంగా కథలను రెడీ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక స్టార్ హీరోల్లో మంచి రైటర్ స్కిల్స్ ఉన్న వారిలో పవన్ కళ్యాణ్ ఒకడని అగ్ర రచయితలే చెబుతారు. ఇక ఆయన చాలా కథలు రాసుకున్నప్పటికి ఇంకా అవి పట్టాలెక్కలేదు. జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు తప్పితే పవన్ కళ్యాణ్ పెద్దగా టైటిల్ కార్డ్ వెసుకోలేదు. ఇంతకుముందు కూడా పవన్ తను హీరోగా చేసిన కొన్ని సినిమాలకు రైటింగ్ విషయంలో సహాయం కూడా చేశాడని ఒక టాక్ అయితే ఉంది. ఇక కొన్ని చిన్న బడ్జెట్ లో రూపొందే కథలను కూడా పవన్ రాసుకున్నట్లు టాక్.
ఇక ఆ కథలను ఇటీవల తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. సాయి తేజకు కూడా స్టోరీలపై ఇప్పుడిప్పుడే పట్టు సాదిస్తున్నాడు. ప్రతి రోజు పండగా కథ మెయిన్ ఐడియా సాయిదేనని డైరెక్ట్ గా దర్శకుడే చెప్పాడు. ఇక మామయ్య ఇచ్చిన కథలపై కూడా ఈ హీరో కొంత ఫోకస్ పెట్టినట్లు ఇప్పుడిపుడే ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వైరల్ అవుతోంది. నెక్స్ట్ సాయి దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి పవర్ స్టార్ సెట్ చేసిన కథలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.