మెగా హీరోలతో మల్టీస్టారర్ దర్శకుడి కొత్త ప్లాన్.. సెట్టయితే పండగే!
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ ప్రాజెక్టులకు భారీగా డిమాండ్ పెరిగింది. బాలీవుడ్ లో ఏడాదికో మల్టీస్టారర్ కథ తెరపైకి వస్తుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. RRR సినిమాతోనే మల్టీస్టారర్ రూపురేఖలు మారిపోనున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ అంతకు మించి అనేలా సినిమాలు రెడీ అవుతాయని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక మెగా మల్టీస్టారర్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ కోరిక నెరవేరేలా ఉంది
ఇక ఆ మెగా హీరో మరెవరో కాదు.. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మామయ్యలతో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఈ యువ హీరో చాలా రోజులగా ఎదురుచూస్తున్నాడు. చాలా ఇంటర్వ్యూలలో కూడా తనకు మెగాస్టార్, పవర్ స్టార్ తో నటించాలని ఉందని చాలా క్లియర్ గా చెప్పాడు. ఇక ఆ కోరిక త్వరలోనే నెరవేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బాబీ దర్శకత్వంలో న్యూ ప్రాజెక్ట్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక ఆ ప్రాజెక్టు అనంతరం బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ ఒక సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు.
Recommended Video

ఆ రోజున స్పెషల్ ఎనౌన్స్మెంట్..?
ప్రస్తుతం దర్శకుడు బాబీ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సాయి ధరమ్ తేజ్ ని అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మెగాస్టార్ మరోసారి దర్శకుడితో చర్చలు జరపాలని అనుకుంటున్నాడు. ఇదివరకే వెంకీమామ అంటూ వెంకటేష్ తో నాగ చైతన్యతో మంచి మల్టీస్టారర్ సినిమాను అందించిన బాబీ ఇప్పుడు మెగా కాంబినేషన్ ని కూడా అలానే సెట్ చేస్తుండడం విశేషం. మెగాస్టార్ బర్త్ డే (ఆగస్టు 22) రోజున ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











