‘F3’లో మరో మెగా హీరో: ఊహించని పాత్రలో కనిపించి షాకివ్వనున్న స్టార్.. మరింత ఫన్ ఖాయం

గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో తెలుగులో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా హీరోలు ధైర్యం చేయడం వల్లే ఈ తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికితోడు ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాల్లో చాలా వరకు విజయవంతం అవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇలా రెండేళ్ల క్రితం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం 'F2'. ఇది సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో వీళ్లిద్దరితో పాటు మరో మెగా హీరో కూడా నటిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

F3 Movie Launched With Pooja Ceremony
వాళ్లిద్దరి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సక్సెస్

వాళ్లిద్దరి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సక్సెస్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించాడు అనిల్ రావిపూడి.

కలెక్షన్ల పరంగానూ అదరగొట్టేసింది

కలెక్షన్ల పరంగానూ అదరగొట్టేసింది

రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) విడుదలైంది. ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి సెలవుల్లో హవాను చూపిస్తూ ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. ఆ ఏడాది విడుదలైన సినిమాలు అన్నింటిలోనూ ఎక్కువ లాభాలు దీనికే వచ్చిన విషయం తెలిసిందే.

సీక్వెల్‌ను మొదలెట్టిన F3 యూనిట్

సీక్వెల్‌ను మొదలెట్టిన F3 యూనిట్

'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సూపర్ డూపర్ హిట్ అవడంతో, దీనికి సీక్వెల్‌ను తీయాలని డిసైడ్ అయింది చిత్ర యూనిట్. గత ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' వంటి బడా హిట్‌ను అందుకున్న అనిల్ రావిపూడి.. లాక్‌డౌన్ సమయంలో ఈ కథను సిద్ధం చేశాడు. ఇందులో భాగంగానే 'F3' పేరిట ఈ సినిమాను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా ప్రారంభించేశారు.

ఇద్దరు కాదు.. ముగ్గురు.. వాళ్ల పేర్లు

ఇద్దరు కాదు.. ముగ్గురు.. వాళ్ల పేర్లు


'F2'లో ఇద్దరు హీరోలు నటించడంతో, దానికి సీక్వెల్‌గా రాబోతున్న 'F3'లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సహా ముగ్గురు స్టార్లు ఉంటారని జోరుగా ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే మాస్ మహారాజ రవితేజ, రామ్, సునీల్ సహా ఎంతో మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఇద్దరితోనే.. అసలు సమస్య అక్కడే

ఇద్దరితోనే.. అసలు సమస్య అక్కడే


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ వస్తుంది.

‘F3’లో మరో మెగా హీరో.. ఆ పాత్రలో

‘F3’లో మరో మెగా హీరో.. ఆ పాత్రలో


తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. 'F3'లో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడట. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే అతడి పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఎవరూ ఊహించని గెటప్‌లో అతడు దర్శనమివ్వబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు అతడి రాక మరింత ఫన్ ఇచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X